బన్ని- చరణ్‌లను ఫాలో అవుతున్న హిందీ హీరో
తాజా కథనాల ప్రకారం.. కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు తన రొమాంటిక్ కామెడీ `సోను కి టిటు కి స్వీటీ` సీక్వెల్ కోసం లవ్ రంజన్‌తో చర్చలు జరుపుతున్నాడు.
By: Tupaki Desk | 4 Dec 2024 4:17 AM GMTభూల్ భూలయ్యా 3తో బ్లాక్ బస్టర్ కొట్టాడు కార్తీక్ ఆర్యన్. లవ్ ఆజ్ కల్ సీక్వెల్ .. అతిథి తుమ్ కబ్ జావోగే సీక్వెల్.. ఇవన్నీ కార్తీక్ ఖాతాలోనివే.. అతడి లైనప్‌లో పతి, పత్నీ ఔర్ వో’ సీక్వెల్ ..ఆషికి సీక్వెల్ (ఆషికి 3) లైనప్ లో ఉన్నాయి. అతడు సీక్వెల్ లో నటిస్తే అది బంపర్ హిట్ గ్యారెంటీ. అందుకే అతడు వరుసగా సీక్వెల్ చిత్రాల్లో నటిస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.
తాజా కథనాల ప్రకారం.. కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు తన రొమాంటిక్ కామెడీ `సోను కి టిటు కి స్వీటీ` సీక్వెల్ కోసం లవ్ రంజన్‌తో చర్చలు జరుపుతున్నాడు. కార్తీక్ కెరీర్ లో అద్భుతమైన రొమాంటిక్ కామెడీ చిత్రమిది. యువతరంలో ఈ సీక్వెల్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అతడు ఇంకా పలు సీక్వెల్ లను పట్టాలెక్కించేందుకు చర్చలు సాగిస్తున్నాడని తెలిసింది.
అయితే అతడు సీక్వెల్ చిత్రాలతోనే సేఫ్ గేమ్ ఇంకెన్నాళ్లు? కేవలం కామెడీ జానర్ లు.. హారర్ కామెడీలు, రొమాంటిక్ కామెడీలు మాత్రమే చేస్తున్నాడనే అపప్రదను యువహీరో మూటగట్టుకుంటున్నాడు. కెరీర్ లో వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేయడం లేదని కూడా క్రిటిక్స్ విమర్శిస్తున్నారు.
బహుశా కార్తీక్ ఆర్యన్ ఏజ్ లుక్ వ్యక్తిత్వానికి కేవలం కొన్ని పరిమిత జానర్లు మాత్రమే సూటబుల్. అతడు భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తే ఫలితం తారుమారు అయ్యేందుకు ఛాన్సు లేకపోలేదు. ఇటీవలే చందు చాంపియన్ లాంటి బయోపిక్ చిత్రంతో ప్రయోగం చేసాడు. ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మైలేజ్ రాలేదు. నటుడిగా అతడికి అవార్డులు రివార్డులు దక్కాయి కానీ పంపిణీ వర్గాలకు నష్టాలొచ్చాయి. అందుకే అతడు ప్రయోగాలకు వెనకాడుతున్నాడని కూడా భావించాల్సి ఉంటుంది.
కోట్లాది రూపాయల బడ్జెట్లతో సాహసాలు ప్రయోగాలు చేయడం హీరోలకు సులువు. కానీ నిర్మాతల్ని సేఫ్‌లో ఉంచడం చాలా ముఖ్యమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి వాళ్లు నిరంతరం చెబుతుంటారు. బహుశా కార్తీక్ ఆర్యన్ ఇదే ఫార్ములాను తన కెరీర్‌లో అనుసరిస్తున్నాడని భావించాలి.