క్రమశిక్షణ లేదని తిట్టిన నిర్మాత మళ్లీ అదే హీరోతో?
అతడికి సరిగా ప్రవర్తన తెలియదని, సెట్ కి ఆలస్యంగా వచ్చేవాడని, సృజనాత్మక అంశాల్లో వేలు పెడతాడని కూడా టాక్ స్ప్రెడ్ అయింది
By: Tupaki Desk | 23 Nov 2024 12:30 AM GMTపరిశ్రమ అగ్ర నిర్మాత ఆ యువహీరోపై కక్ష కట్టాడని ప్రచారం ఉంది. అతడికి సరిగా ప్రవర్తన తెలియదని, సెట్ కి ఆలస్యంగా వచ్చేవాడని, సృజనాత్మక అంశాల్లో వేలు పెడతాడని కూడా టాక్ స్ప్రెడ్ అయింది. అంతేకాదు సదరు అగ్ర నిర్మాత తన కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాని అతడితో ప్రారంభించి కొన్ని రోజుల పాటు చిత్రీకరణ చేసాక కూడా దానిని మధ్యలో ఆపేసాడు. కోట్లలో నష్టం కూడా వాటిల్లింది. అదే సమయంలో ఆ యువహీరోతో తాము ఎప్పటికీ కలిసి పని చేసేది లేదని కూడా సదరు అగ్ర నిర్మాత బ్యానర్ ప్రకటించింది. అయితే మధ్యలో నిలిచిపోయిన ఈ సినిమా మరేదో కాదు.. దోస్తానా 2. కార్తీక్ ఆర్యన్ - కరణ్ జోహార్ మధ్య గొడవ గురించే ఇదంతా.
అయితే రాజకీయాల్లో సినిమాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇటీవల ఆ ఇద్దరూ తిరిగి కలిసిపోయారు. కలిసి సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఆసక్తికరంగా కరణ్ యువహీరో కార్తీక్ ని కోలుకోలేని దెబ్బ కొడతాడని భావించినా కానీ, కార్తీక్ కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లతో తనను తాను నిలబెట్టుకున్నాడు. భూల్ భులయా 2, భూల్ భులయా 3 చిత్రాలతో బంపర్ హిట్లు కొట్టాడు. దీంతో అతడు తన కెరీర్ లో ఫ్లాపులు ఉన్నా కానీ, ఇటీవల వరుసగా క్రేజీ ఫ్రాంఛైజీ చిత్రాలకు సంతకాలు చేస్తున్నాడు. స్త్రీ 2 తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన దినేష్ విజన్ తో, అలాగే కరణ్ జోహార్ తో అతడు తిరిగి పని చేస్తాడని టాక్ వినిపిస్తోంది.
1000 కోట్ల క్లబ్‌లో చేరిన యువహీరో
భారతదేశంలోని నికర బాక్సాఫీస్ కలెక్షన్లలో రూ.1000 కోట్లను అధిగమించడం ద్వారా కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో అత్యంత ఆధారపడదగ్గ గ్యారెంటీ స్టార్‌లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఘనత పరిశ్రమలో కొద్దిమంది మాత్రమే సాధించారు. కెరీర్ ఆరంభం నుంచి భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధించిన కార్తీక్ ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నాడు. కథానాయకుడిగా దశాబ్దపు ప్రయాణంలో అతడు అద్భుతాలు చేసాడు. రొమాంటిక్ కామెడీల నుండి హారర్ కామెడీలు, భావోద్వేగాలతో కూడిన డ్రామాలతో అతడు మ్యాజిక్ చేసాడు. ప్రతిష్టాత్మకమైన టాప్ 20 ఆల్ టైమ్ బాలీవుడ్ నటుల జాబితాలోకి ప్రవేశించిన కార్తిక్ ఆర్యన్ స్థిరంగా భారీ బాక్సాఫీస్ హిట్‌లను అందించిన సినిమా లెజెండ్‌లలో చేరాడు. నేటితరం సూపర్ స్టార్‌గా తన స్థాయిని మరింత పటిష్టం చేసుకున్నాడు.
కార్తీక్ నటించిన ..
సినిమా పేరు - జీవితకాలం (కోట్లలో)
భూల్ భూలయ్యా 3 - 251.65 కోట్లు.
చందు ఛాంపియన్ - 62.95 కోట్లు.
సత్యప్రేమ్ కథ - 77.55 కోట్లు.
షెహజాదా - 32.2 కోట్లు.
భూల్ భూలయ్యా 2 - 185.92 కోట్లు
లవ్ టుడే టుమారో - 34.99 కోట్లు.
పతి పత్నీ ఔర్ హూ - 86.89 కోట్లు.
లుకా చుప్పి - 94.75 కోట్లు.
సోను కే టిటు కి స్వీటీ - 108.95 కోట్లు.
లండన్‌లో అతిథి - 10.64 కోట్లు.
ప్యార్ కా పంచనామా 2 - 64.1 కోట్లు
కాంచీ…- 3.9 కోట్లు.
ఆకాశవాణి - 2.11 కోట్లు.
ప్యార్ కా పంచనామా - 9 కోట్లు
ఈ సినిమాల నుంచి ఓవరాల్ వసూళ్లు మొత్తం రూ.1025.60 కోట్లు. ఈ విజయంతో బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో టాప్ 20 హీరోల్లో నిలిచాడు. టాప్ 5 స్థానాల్లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్ ఉన్నారు.