Begin typing your search above and press return to search.

ఎలుక‌ల‌తో హీరో రియ‌ల్ పోరాటం!

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో కార్తీక్ ఓ బ్రాండ్ గా మారుతున్నాడు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 12:31 PM GMT
ఎలుక‌ల‌తో హీరో రియ‌ల్  పోరాటం!
X

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో కార్తీక్ ఓ బ్రాండ్ గా మారుతున్నాడు. ఇండ‌స్ట్రీ వారసులున్నా త‌న‌కేం పోటీ కాదంటూ ముందుకు సాగిపోతున్నాడు. కొత్త అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. క‌ర‌ణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత స‌హ‌కారం లేక‌పోయినా సోలోగా ఛాన్సులందుకుని చూపిస్తున్నాడు. గ‌తేడ‌ది `భూల్ భూల‌య్య‌-2` తో భారీ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా అత‌డి కెరీర్ లో భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ విజ‌యంతో ఏకంగా నాలుగు కోట్ల ఖ‌రీదుగ‌ల కారు సైతం బ‌హుమ‌తిగా అందుకున్నాడు. టీసిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ ఈ గిప్ట్ అందించారు. అయితే ఇప్పుడీ కారు హీరోకి స‌మ‌స్య‌గా మారింది. ఆ కారులో మ్యాట్ మొత్తాన్ని ఎలుక‌లు పాడు చేసాయ‌ట‌. అలాగే వైరింగ్ కూడా ముక్క‌లుగా కొరికేసి ఎందుకు ప‌నికిరాకుండా చేసాయ‌న్న విష‌యాన్ని రివీల్ చేసాడు.

`ఇలా జ‌ర‌గ‌డం తొలిసారి కాదు. ఇప్ప‌టికే రెండు సార్లు జ‌రిగితే అందుకు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి రిపేర్ చేయించాడుట‌. తాజాగా మ‌ళ్లీ కొర‌క‌డంతో అద‌నంగా మ‌రో రెండు..మూడు ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాల్సి వచ్చిందిట‌. అవ‌న‌స‌ర‌మైన పెట్టుబ‌డి పెట్టాల్సి వ‌స్తోంద‌ని అంటున్నాడు. ప్ర‌స్తుతం ఆ కారు ఇంకా గ్యారేజ్ లోనే ఉందిట‌. కారు రెగ్యుల‌ర్ గా వాడ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతుందంటున్నాడు.

ఇంట్లో నాలుగైదు కార్లు ఉండ‌టంతో డైలీగా ఇదే కారు తీసే ప‌రిస్థితి లేదంటున్నాడు. మొత్తానికి ఇంట్లో ఎక్కువ కార్లుంటే ఇలాంటి ప‌రిస్థితి కూడా ఉంటుంద‌న్న సంగ‌తి తెలుస్తుంది. ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ `చంద్ ఛాంపియ‌న్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 14న రిలీజ్ అవుతుంది. బ‌యోపిక్ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పైగా బాలీవుడ్ లో బ‌యోపిక్ లు ఫెయిలైన సంద‌ర్భాలు కూడా రేర్.