చరణ్ న్యూ కాంబో.. ఓ లీక్ ఇచ్చిన రాజమౌళి తనయుడు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో RC 17 మూవీని తాజాగా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 March 2024 4:31 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో RC 17 మూవీని తాజాగా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందని ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ టైంలోనే క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ కూడా చాలా సందర్భాలలో పుష్ప ది రూల్ తర్వాత చరణ్ తోనే మూవీ ఉంటుందని చెప్పారు. అఫీషియల్ గా సినిమాని హొలీ రోజున ఎనౌన్స్ చేశారు.
గతంలో వీరి కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ కు నటుడిగా కీడా సరికొత్త బూస్ట్ ఇచ్చింది ఆ సినిమా. ఇక RC17 షూటింగ్ ఈ ఏడాది ఆఖరులోనే స్టార్ట్ అవుతుందని కూడా స్పష్టం చేశారు. దీనిని బట్టి సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు.
తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ ఇంటరెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ గ్యాప్ లో సుకుమార్ తో సినిమాపై చరణ్ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి నాతో చరణ్ ఆ సమయంలో చెప్పారని అన్నాడు. చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఐదు నిమిషాలు కంట్రోల్ తప్పాను. అప్పటి నుంచి మూవీ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా… ఎప్పుడు తెరపై చూస్తానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
మొత్తానికి అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అందులో ఐకానిక్ సీక్వెన్స్ లో ఒకటిగా చరణ్ చెప్పింది కూడా ఉంటుంది. ఇంతకు మించి రివీల్ చేయాలని అనుకోవడం లేదు అంటూ కార్తికేయ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఏజ్ చరణ్ ఫ్యాన్స్ గతంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో మాట్లాడిన వీడియోని షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.
దీంతో RC17 మూవీ అందరూ ఊహించుకునే దానికంటే హైఎండ్ లో ఉంటుందని భావిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ ని కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి క్యారెక్టరైజేషన్ ని RC17లో సుకుమార్ చూపించబోతున్నాడని అర్ధమవుతోంది. ఈ సినిమా కోసం కూడా మైత్రి మూవీ మేకర్స్ 300 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
కార్తికేయ ట్వీట్, గతంలో రాజమౌళి చేసిన కామెంట్స్ తో RC17 మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి. దీంతో RC17 సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. వచ్చే ఏడాది ఆఖరులో రిలీజ్ కాబోయే ఈ చిత్రంతో సుకుమార్ ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారు అనేది ఆసక్తికర విషయంగా ఇప్పుడు మారింది.