Begin typing your search above and press return to search.

లడ్డు వివాదం..కార్తీ ఫ్యామిలీపై సీనియర్ నటి స్టన్నింగ్ కౌంటర్

వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తాను ఎల్లప్పుడూ సంప్రదాయాలకు రెస్పెక్ట్ ఇస్తానని తెలిపారు.

By:  Tupaki Desk   |   25 Sep 2024 8:28 AM GMT
లడ్డు వివాదం..కార్తీ ఫ్యామిలీపై సీనియర్ నటి స్టన్నింగ్ కౌంటర్
X

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో సత్యం సుందరం మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో హీరో కార్తీ లడ్డూ విషయంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ అడగ్గా.. ఇప్పుడు లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని నవ్వుతూ అన్నారు కార్తీ. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అసహనం వ్యక్తం చేస్తూ.. సినిమా ఈవెంట్ లో లడ్డూ ఇష్యూపై అలా అనడం కరెక్ట్ కాదని అన్నారు.


ఆ తర్వాత కార్తీ స్పందించి.. అనుకోకుండా జరిగినందుకు సారీ చెప్పారు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తాను ఎల్లప్పుడూ సంప్రదాయాలకు రెస్పెక్ట్ ఇస్తానని తెలిపారు. కార్తీ ట్వీట్ ను పవన్ కూడా స్వాగతించారు. ఆయన స్పందించిన తీరు సంతోషమని అన్నారు. శ్రీవారి లడ్డూ వంటి పలు విషయాలు లక్షలాది మంది భక్తుల భావోద్వేగాలు కలిగి ఉంటాయని తెలిపారు. మనలాంటి వాళ్ళు.. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. సత్యం సుందరం మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు.

ఇదంతా తెలిసిన సంగతే.. ఇప్పుడు ఈ వ్యవహారంపై సీనియర్ నటి కస్తూరి శంకర్ స్పందించారు. సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు పెట్టారు. "పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత కార్తీ త్వరగా సారీ చెప్పారు. తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినని అన్నారు. కార్తీ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆయన మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. అంటే ఈ విషయం అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే.. " అంటూ పలు ఆరోపణలు చేశారు కస్తూరి.

"కార్తీ, అరవింద్ స్వామి యాక్ట్ చేసిన మెయ్యిజగన్ మూవీ తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ అవుతుంది. మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో లడ్డూ మీమ్ ను చూపించారు. అసలు డైరెక్టర్, యాంకర్ ఏమనుకుంటున్నారో.. వాళ్లకు జోక్ గా ఉందేమో.. కార్తీ దాని నుంచి కూడా తప్పించుకునేందుకు ట్రై చేశారు. కానీ అందులో ఫెయిల్ అయ్యారు. యాంకర్ మూర్ఖంగా వ్యవహరించింది. కార్తీ హాస్యాస్పదంగా ఆన్సర్ ఇవ్వడంతో అంతా నవ్వుకున్నారు. ఇది బ్యాడ్ మూవ్" అంటూ ఫైర్ అయ్యారు.

" ఆ క్వశ్చన్ పై కార్తీ సీరియస్ గా రియాక్ట్ అయినా.. యాంకర్ కు వార్నింగ్ ఇచ్చినా.. లేక ఆందోళన వ్యక్తం చేసినా.. ఎలాంటి సమస్య ఉండేది కాదు. యాంకర్ ను హర్ట్ చేయకుండా ఉండేందుకు ట్రై చేశారు. ఎంతోమందిని బాధపెట్టారు. కార్తీ ఫ్యామిలీ సనాతన పద్ధతులపై వివాదాస్పదంగా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. శబరిమలపై శివకుమార్ సర్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. జ్యోతిక ఆలయ వ్యతిరేక వ్యాఖ్యల వల్ల దుమారం రేగింది. అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులతో ఎవ్వరూ చెలగాటమాడలేరు. హిందూ వ్యతిరేకత ఆంధ్రలో స్వాగతించబడదు. ఓం నమో వేంకటేశాయ" అని కస్తూరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.