Begin typing your search above and press return to search.

కస్తూరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

నిన్నటితరం హీరోయిన్ కస్తూరి ఈమధ్య తరచు వార్తల్లో ఉంటూ వస్తుంది. రీసెంట్ గా తమిళనాడులో ఉంటున్న తెలుగు వాళ్ల మీద సంచలన కామెంట్స్ చేసింది

By:  Tupaki Desk   |   20 Nov 2024 2:45 AM GMT
కస్తూరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
X

నిన్నటితరం హీరోయిన్ కస్తూరి ఈమధ్య తరచు వార్తల్లో ఉంటూ వస్తుంది. రీసెంట్ గా తమిళనాడులో ఉంటున్న తెలుగు వాళ్ల మీద సంచలన కామెంట్స్ చేసింది. ఐతే వివాదం ముదురుతున్న టైంలో ఆమె సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా సరే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. సౌత్ సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా బుల్లితెర మీద కూడా తన నటనతో మెప్పిస్తూ వచ్చిన కస్తూరి గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని బయట పడ్డాయి.

ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. భర్త విషయాలు తెలిసి అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు. కస్తూరి సినిమాల ద్వారానే పాపులారిటీ సంపాదించుకుని ఆమె భారీగా సంపాదించారు అనుకున్నారు. కానీ ఆమెది ఒక రిచ్ ఫ్యామిలీనే అని తెలిసింది. అంతేకాదు ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారట. సినిమాల్లోకి రాకముందే మిస్ చెన్నైతో పాటుగా మిస్ మద్రాస్ గా కూడా ఆమె విజేతగా నిలిచారు.

కస్తూరి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ధనుష్ తండ్రి కస్తూరి రాజా కారణమని తెలుస్తుంది. అతని రిఫరెన్స్ వల్లే కస్తూరి సినిమాల్లోకి వచ్చింది. కస్తూరి తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేశారు. కస్తూరి భర్త ఒక డాక్టర్. సినిమాల్లో ఉన్నప్పుడే కస్తూరి డాక్టర్ రవికుమార్ ని పెళ్లి చేసుకున్నారు.

కస్తూరి రవికుమార్ లకు ఇద్దరు సంతానం. విషయం ఏదైనా తన మార్క్ కామెంట్స్ తో నిత్య వార్తల్లో నిలిచే కస్తూరి ఈమధ్య చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. కస్తూరి తెలుగు వాళ్లను అవమానిస్తూ చేసిన కామెంట్స్ వల్ల పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఐతే ఇదివరకు కూడా ఇండస్ట్రీకి సంబందించిన విషయాల్లో ఎవరైనా తమకు కలిగిన ఇబ్బందిని బయట పెడితే వారికి సపోర్ట్ గా కస్తూరి మాట్లాడుతుంది.

కస్తూరి కేవలం సినిమాల ద్వారా పాపులర్ అయినా ఆమె స్వతహాగా సంపన్న కుటుంబంలో పుట్టిందన్న విషయం ఎవరికీ తెలియదు. ఐతే అయినా సరే ఆమె సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ తన ప్యాషన్ ను కొనసాగించారు. ఐతే వివాదాస్పద విషయాల పట్ల తన అభిప్రాయాన్ని చెప్పడంలో ముందుండే కస్తూరి వాటి వల్ల అనవసరమైన ఇబ్బందుల్లో పడుతుంది.