Begin typing your search above and press return to search.

త్రిషపైనా ఇలాంటి ఆరోప‌ణ చేసారు: న‌టి క‌స్తూరి

నటీనటులపై ఇలాంటి నిరాధార ఆరోపణలు కొత్తేమీ కాదని కస్తూరి సూచించారు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 2:26 PM GMT
త్రిషపైనా ఇలాంటి ఆరోప‌ణ చేసారు: న‌టి క‌స్తూరి
X

నాగ చైతన్యతో సమంత రూత్ ప్రభు విడాకుల విషయంలో తెలంగాణ‌ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం చెల‌రేగుతోంది. తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల నుంచి స్టార్లు దీనిని ఖండిస్తున్నారు. కొండా వ్యాఖ్య‌ల‌ను నటి కస్తూరి శంక‌ర్ త‌ప్పు ప‌ట్టారు. నాగార్జున కుటుంబాన్ని విడాకులకు లింక్ చేస్తూ సురేఖ నిరాధారమైన వాదనలను తెర‌పైకి తెచ్చార‌ని, ఇది బాధాక‌ర‌మని కస్తూరి కొట్టిపారేసారు.

నటీనటులపై ఇలాంటి నిరాధార ఆరోపణలు కొత్తేమీ కాదని కస్తూరి సూచించారు. గతంలో తమిళనాడు రాజకీయ నాయకుడు నటి త్రిషపైనా తప్పుడు ఆరోపణలు చేసిన సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడు త్రిషను కోరుకుంటే ఆమె నిరాకరించగా.. ఆమె స్థానంలో మరొక నటిని పంపార‌ని వ్యాఖ్యానించిన‌ట్టు క‌స్తూరి గుర్తు చేసారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేస్తోందని కస్తూరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగత లెక్కలు తేల్చుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని ఆమె విమర్శించారు. సమంత - నాగ చైతన్యల విడాకుల వివాదంలోకి రాజ‌కీయాలు ఎలా ప్ర‌వేశించాయో ఈ ఉదంతం స్ప‌ష్ఠంగా చెబుతోంది. మ‌నిషి జీవితం రాజకీయాల‌తో ముడిప‌డిన‌ది.. రాజ‌కీయాల‌ను విడిగా చూడ‌లేం! అని ఇది గుర్తు చేస్తోంది. ఈ జంట విడిపోవడానికి గల కారణాలు అస్ప‌ష్ఠంగా ఉండ‌టంతో మీడియాలో ఎప్ప‌టికీ ఊహాగానాలు, పుకార్లు షికార్ చేస్తున్నాయి.