హీరో టార్చర్ తో మూడు ఆఫర్లు కోల్పోయా!
ప్రస్తుతం తెలుగు సినిమాలకంటే తమిళ సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గా ఆమె పడిన ఇబ్బందుల గురించి రివీల్ చేసారు.
By: Tupaki Desk | 29 Feb 2024 11:30 PM GMT90స్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వెటరన్ నటి కస్తూరి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ లో ఎన్నో సినిమాల్లో నటించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తిం పును దక్కించుకున్నారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ తో తెలుగు నాట మరింత ఫేమస్ అయ్యారు.
ప్రస్తుతం తెలుగు సినిమాలకంటే తమిళ సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గా ఆమె పడిన ఇబ్బందుల గురించి రివీల్ చేసారు. ఆవేంటో ఆమె మాట్లోలనే.. 'ఓ హీరోతో నేను మూడు సినిమాలు చేయవలసి ఉంది. మొదటి సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయం లోనే అతను నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. తన లిమిట్స్ దాటి ప్రవర్తించడానికి ట్రై చేసాడు. నేను కొంత వరకూ భరించాను. కానీ ఆగడాలు ఎక్కువ అవ్వడంతో ఒక్కసారిగా అసహనాన్ని వ్యక్తం చేసాను.
అందరి ముందు సీరియస్ అయ్యాను. ఆ కక్షతో ఆ సినిమా నుంచి తీసేసాడు. ఆ తర్వాత మిగతా రెండు సినిమాల నుంచి కూడా తన బలం ఉపయోగించి తప్పుకునేలా చేసాడు. అయినా నేనేం బాధపడలేదు. అది కూడా నా మంచికే జరిగిందనుకున్నాను. ఎందుకంటే మనసులో తిట్టుకుంటూ .. పైకి నవ్వుతూ పలకరిస్తూ నటించడం నా వల్ల కాదు. నేను ముక్కు సూటి మనిషిని. విషయం ఏదైనా ముఖం మీదనే చెప్పే తత్వం నాది' అని అన్నారు.
కస్తూరి తెలుగులో 1992 లో 'గ్యాంగ్ వార్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'నిప్పురవ్వ' .. 'గాడ్ ఫాదర్' లోనూ నటించారు. అలాగే జగపతి బాబుతో 'చిలకొట్టుడు' సినిమాలోనే నటించారు. ఇంకా 'రధయాత్ర'..'అన్నమయ్య' చిత్రాల్లోనూ వైవిథ్యమైన పాత్రలతో కస్తూరి మెప్పించారు. ఇంకా నాగార్జున తో' ఆకాశవీధిలో' చిత్రంలోనూ మెరిసారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' లోనూ నటించారు.