సూపర్‌స్టార్ బ్యాచిలర్ లైఫ్‌పై సహనటి ఆందోళన
అయితే వీళ్లకు ధీటుగా అందగత్తెల స్క్రుటినీలో ఉన్న హాలీవుడ్ బ్యాచిలర్ గురించి మీడియాలో బోలెడంత చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 29 Dec 2024 3:15 AM GMTఅన్ని పరిశ్రమల్లో ఎలిజిబుల్ బ్యాచిలర్ల పెళ్లి గురించి చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో ప్రభాస్ .. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ గురించి రెగ్యులర్ గా పెళ్లి ప్రస్థావన తేవడం మీడియాలకు అలవాటు. అయితే వీళ్లకు ధీటుగా అందగత్తెల స్క్రుటినీలో ఉన్న హాలీవుడ్ బ్యాచిలర్ గురించి మీడియాలో బోలెడంత చర్చ సాగుతోంది. అతడు మరెవరో కాదు. అందగాడు.. ట్యాలెంటెడ్ హీరో లియోనార్డో డికాప్రియో. టైటానిక్ కథానాయకుడు. అతడు మొదటి బ్రేకప్ తర్వాత చాలా కాలంగా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నాడు.
అంతేకాదు ప్రియురాలితో షికార్లు చేస్తున్నా, పెళ్లికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు టైటానిక్ ప్రేయసి కేట్ విన్ స్లెట్ అతడి ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడింది. 50 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి మాటెత్తని డికాప్రియో గురించి తాను ఆందోళన చెందుతున్నానని తెలిపింది. అతడిని ప్రస్తుత స్నేహితురాలు, మోడల్ విట్టోరియాను వివాహం చేసుకోమని అడుగుతోంది. వారి సన్నిహిత బంధం గురించి తెలిసినా కానీ, ఇంకా ఎన్నాళ్లు పెళ్లి లేకుండా? అని ప్రశ్నిస్తోంది.
1997 లో విడుదలైన సంచలన హిట్ చిత్రం `టైటానిక్`లో ప్రేమికులు డికాప్రియో- కేట్ విన్ స్లెట్. ప్రపంచంలోనే అత్యంత అందమైన జంటగా ఆ ఇద్దరికీ పేరుంది. లియోనార్డో డికాప్రియో ఇటీవల జీవిత చరిత్రలు, పీరియాడికల్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్నాడు. ప్రస్తుత స్నేహితురాలు, మోడల్ విట్టోరియాతో సంబంధంలో ఉన్నా ఇంకా బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే సోదర సమానుడైన లియోనార్డో డికాప్రియోపై కేట్ విన్స్‌లెట్ తీవ్ర ఆందోళనలో ఉంది. కేట్ తన కొత్త చిత్రం `లీ` స్క్రీనింగ్ సమయంలో ఈ ప్రస్థావన తెచ్చింది.
కేట్ లియోను ఆరాధిస్తాడు. అతడు గొప్ప భర్త అవుతాడు.. తండ్రిగా మారతాడని అనుకుంటాడు. తెలియని భయాలు అతడిని ఆపేస్తున్నాయి! అంటూ పబ్లిక్ వేదికపై కేట్ మాట్లాడింది. అతడు పెళ్లి విషయంలో త్వరపడటం లేదని కూడా వ్యాఖ్యానించింది. పరిస్థితులు చేజారిపోయేలా విక్టోరియాతో కూడా అదే తప్పు చేస్తాడని భయపడుతున్నట్టు కేట్ పేర్కొంది.
కేట్ విన్‌స్లెట్ రెండుసార్లు విడాకులు ఇచ్చి.. మూడోసారి ఎడ్వర్డ్ అబెల్ స్మిత్‌ను 2012లో వివాహం చేసుకుంది. 46 ఏళ్ల స్మిత్ పాపులర్ బిలియనీర్. ఔత్సాహిక అంతరిక్ష యాత్రికుడు రిచర్డ్ బ్రాన్సన్ మేనల్లుడు. అతడు వర్జిన్ గ్రూప్ యజమాని, వ్యవస్థాపకుడు. స్మిత్ కేట్ విన్స్‌లెట్‌తో పెళ్లికి ముందు వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ స్పేస్ ఆర్మ్ కోసం పనిచేశాడు. 26 ఏళ్ల మోడల్ విట్టోరియాతో ప్రేమలో ఉన్న లియోనార్డో డికాప్రియో తన ప్రేమలో సాంత్వన పొందుతున్నాడని కేట్ భావిస్తోంది. అయితే అతడు తన మొదటి భార్యకు టెక్నికల్ గా విడాకులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడని వెబ్ లో కథనాలొచ్చాయి.