Begin typing your search above and press return to search.

ఆహాలోకి మరో ప్రేమకథ.. ట్రైలర్ ఎలా ఉందంటే?

అయితే తాజాగా ఆహా నిర్వాహకులు మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 2:32 PM GMT
ఆహాలోకి మరో ప్రేమకథ.. ట్రైలర్ ఎలా ఉందంటే?
X

సాధారణంగా లవ్ జోనర్ లో రూపొందిన సినిమాలపై ఆడియన్స్ లో ఎప్పుడూ మంచి ఆసక్తి ఉంటుంది. అందులోనూ విలేజ్ నేపథ్యంలోని లవ్ స్టోరీస్ అంటే సినీ ప్రియులు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు ఆ కోవకు చెందిన ఓ ప్రేమకథ.. ఆహా ఓటీటీలో సందడి చేయనుంది. త్వరలో స్ట్రీమింగ్ కూడా రానుంది.

ఇంద్రజ, కృతిక రాయ్, కరుణ కుమార్, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన కథా కమామీషు మూవీ.. నేరుగా ఆహాలోనే విడుదల కానుంది. గౌతమ్, కార్తీక్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు మట్కా డైరెక్టర్ కరుణ్ కుమార్ స్టోరీ అందించారు. ఐ డ్రీమ్ మీడియా, త్రి విజిల్స్ టాకీస్ బ్యానర్లపై చిన వాసుదేవ రెడ్డి రూపొందించారు.

ఇప్పటికే పోస్టర్ ను విడుదల చేసిన ఆహా నిర్వాహకులు.. "లైఫ్ లో ఉండాలి జోషు.. త్వరలో మీకోసం కథా కమామీషు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ లో మూవీలోని లీడ్ రోల్స్ సరదాగా ఆడుతూ కనిపించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఆహా నిర్వాహకులు మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు.

దాంతోపాటు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఊర్లో ఉన్న వాళ్లందరికీ ఏం కావాలో నీకు తెలుసు.. ఒక్క మనకు తప్ప అంటూ ఇంద్రజ చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంద్రజ, కరుణ కుమార్ పెళ్లి చేసుకుంటారు. అనంతరం సినిమాలోని క్యాస్టింగ్ అంతా చూపించారు. స్టోరీ లైన్ క్లియర్ గా చెప్పకపోయినప్పటికీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

గ్రామీణ ప్రాంతంలోని లవ్, ఫ్యామిలీ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీగా తెలుస్తోంది. ఓ రూరల్ డ్రామా లాగా మూవీ మెప్పించనున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా కథా కమామీషు ట్రైలర్ తెగ చక్కర్లు కొడుతోంది. క్రేజీగా ఉందని, పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోందని అంటున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. హర్షిణి కోడూరు, స్తుతి రాయ్, మోయిన్, కృష్ణ తేజ, జెమిని సురేష్, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్ ఆర్ ధ్రువన్ మ్యూజిక్ అందించారు. అరవింద్ విశ్వనాథన్.. సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. విశాల్ అబానీ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మరి కథా కమామీషు మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.