Begin typing your search above and press return to search.

కథ కేళీ… క్లాస్ దర్శకుడి హర్రర్ చిత్రం

ఇషారెబ్బ ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే నందిని రాయ్, పూజిత పొన్నాడ, అనన్య నాగళ్ళ లీడ్ రోల్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Aug 2023 10:51 AM GMT
కథ కేళీ… క్లాస్ దర్శకుడి హర్రర్ చిత్రం
X

ఈ మధ్యకాలంలో దర్శకులు కొత్త కథలతో విభిన్నంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆడియన్స్ టేస్ట్ మారడం. బలమైన కథ, కథనాలు ఉంటేనే సినిమాలు హిట్ చేస్తున్నారు. స్టార్ హీరో చిత్రమైన కంటెంట్ లో దమ్ములేకపోతే డిజాస్టర్ అయిపోతున్నాయి. అందుకే దర్శకులు తమ ఆలోచనలకి పదును పెడుతున్నారు. రెగ్యులర్ ఫార్మాట్ కథలు కాకుండా యూనిక్ గా ఉండే కంటెంట్ లని బయటకి తీసుకొస్తున్నారు.

కులుమనాలి చిత్రంతో దర్శకుడిగా మారి తరువాత రామదండు, దొంగలబండి సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ లని అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న శతమానం భవతి మూవీతో సక్సెస్ అందుకున్నారు. వెంటనే నితిన్ తో శ్రీనివాస కళ్యాణం మూవీతో మరో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు.

కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవరా సినిమాతో మరో డిజాస్టర్ కొట్టారు. అయితే సక్సెస్ కోసం గట్టిగా ట్రై చేస్తోన్న ఈ దర్శకుడు ఇప్పటికే శ్రీహరి కొడుకు హీరోగా కోతికొమ్మచ్చి అనే మూవీ చేశారు.

అలాగే ఎన్ఠీఆర్ బావమరిది నితిన్ హీరోగా శ్రీశ్రీ రాజావారు అనే మూవీ కూడా కంప్లీట్ చేశారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడు హర్రర్ జోనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. కథకేళి టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ టీజర్ లాంచ్ చేశారు. దిల్ రాజు మూవీ పోస్టర్ ని ఆవిష్కరించారు.

ఇషారెబ్బ ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే నందిని రాయ్, పూజిత పొన్నాడ, అనన్య నాగళ్ళ లీడ్ రోల్ చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఓ బంగ్లా నేపథ్యంలో జరిగే కథగానే ఉంది. అలాగే ఒక పుస్తకం, అందులో రాసి ఉన్న సంఘటనలకి ఇంట్లో జరిగే కథకి మధ్య ఏదో తెలియని మిస్టరీ ఉందనే విధంగా టీజర్ ని ఆవిష్కరించారు. కంప్లీట్ హర్రర్ జోనర్ లోనే ఈ మూవీని ఆవిష్కరించినట్లు టీజర్ తో క్లారిటీ వస్తోంది.

మరి ఈ చిత్రం సతీష్ వేగేశ్నకి మంచి బూస్ట్ ఇచ్చి ఫామ్ లోకి తీసుకొచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారుస్తుందేమో చూడాలి. కథకేళి సినిమాలో హీరోయిన్స్ అందరూ కూడా తెలుగమ్మాయిలే ఉండటం మరో ప్రత్యేకత అని చెప్పాలి.

విరూపాక్ష సినిమాతో హర్రర్ జోనర్ కథలకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని అర్ధమైంది. మరి కథకేళి చిత్రం కూడా అలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.