కత్రినా కైఫ్ 'దిల్ గులాబి' లుక్ వారెవ్వా
కత్రిన ధరించిన ఈ డ్రెస్ ఖరీదు రూ. 1,72,818. సొగసైన డ్రెప్డ్ ఫ్లోరల్ సిల్క్ మ్యాక్సీ డ్రెస్ ఇది. అద్భుతమైన దుస్తులు దాని గులాబీ రేకులు కేప్ స్లీవ్ల కారణంగా షోస్టాపర్‌గా నిలిచాయి.
By: Tupaki Desk | 19 Oct 2024 3:30 AM GMTమల్లీశ్వరిగా ఎప్పటికీ తెలుగు వారి హృదయాల్లో నిలిచి ఉంది కత్రినా కైఫ్. ఈ భామ బాలీవుడ్లో అగ్ర కథానాయికగా తన హోదాను కొనసాగిస్తోంది. ఇటీవల భారీ యాక్షన్ చిత్రాల్లో అద్భుతమైన స్టంట్స్ తో రక్తి కట్టిస్తున్న కత్రిన చివరిగా 'మెర్రీ క్రిస్మస్'లో కనిపించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు మారియా పాత్రలో కత్రిన నటించారు. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. విమర్శకులు కత్రిన నటనను, క్రిస్మస్ ఈవ్ నాడు సాగే గ్రిప్పింగ్ కథాంశాన్ని ప్రశంసించారు. 2023లో సల్మాన్ ఖాన్ సరసన 'టైగర్ 3'లో కనిపించింది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, హృతిక్ అతిధి పాత్రలు పోషించారు. కానీ ఇది ఆశించిన విజయం సాధించలేదు.
అదంతా అటుంచితే కత్రిన తదుపరి ఏ చిత్రంలో నటిస్తోంది? అన్నదానికి సరైన జవాబు లేదు. కానీ సోషల్ మీడియాల్లో నిరంతరం తన అభిమానులకు ట్రీట్ కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం కొన్ని మంత్రముగ్దులను చేసే ఫోటోగ్రాఫ్స్ తో అభిమానులను అలరించింది. వీటిలో క్రీమ్-కలర్ దుస్తుల్లో కత్రిన ఎంతో అందంగా కనిపిస్తోంది. దిల్ గులాబి (గులాబీ ఎమోజి) అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. కత్రినా ఒక స్టేట్మెంట్ రింగ్ - చెవిపోగులతో రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.
కత్రిన ధరించిన ఈ డ్రెస్ ఖరీదు రూ. 1,72,818. సొగసైన డ్రెప్డ్ ఫ్లోరల్ సిల్క్ మ్యాక్సీ డ్రెస్ ఇది. అద్భుతమైన దుస్తులు దాని గులాబీ రేకులు కేప్ స్లీవ్ల కారణంగా షోస్టాపర్‌గా నిలిచాయి. పొడవాటి ఫ్లోవింగ్ దుస్తులు బోల్డ్ రెడ్ ఫ్లోరల్ ప్రింట్ యాక్సెంట్లతో లేత గోధుమరంగు లుక్ ను కలిగి ఉన్నాయి. ఇది దుస్తులు మొత్తం రూపానికి కళాత్మక నమూనాను జోడించిన సన్నని నలుపు గీతలతో ఆకట్టుకుంది.
అభిమానులు ఈ ఫోటోగ్రాఫ్స్పై రకరకాల వ్యాఖ్యలను జోడించారు. కొందరు అందమైన అమ్మాయి..! అంటూ కత్రినను ప్రశంసించారు. ఈ దుస్తులలో స్టన్నర్ గా ఉందని, కత్రిన దేవత అని కూడా కొందరు ఫ్యాన్స్ ప్రేమను కురిపించారు. కత్రిన - విక్కీ కౌశల్ జంట ఆదర్శ జీవనం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.