Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : 40 లోనూ కత్తి లాంటి అందం

సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

By:  Tupaki Desk   |   16 April 2024 10:34 AM GMT
పిక్ టాక్ : 40 లోనూ కత్తి లాంటి అందం
X

సరిగ్గా 20 ఏళ్ల క్రితం టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌. టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చినా బాలీవుడ్‌ లోనే కత్రీనా కి మంచి గుర్తింపు దక్కింది. చాలా తక్కువ సమయంలోనే హిందీ ప్రేక్షకులు కత్రీనా ను స్టార్‌ హీరోయిన్ గా మార్చేశారు.


సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇటీవలే కత్రీనా వయసు నాలుగు పదులకు చేరింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయ్యింది, పైగా నాలుగు పదుల వయసు.. అయినా కూడా అందం విషయంలో పాతికేళ్ల పడుచు అమ్మాయితో పోటీ అన్నట్లుగా అందంగా కనిపిస్తూ ఉంది.

పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మడు సినిమాల జోరు తగ్గించలేదు. అలాగే సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ తగ్గించలేదు. మొత్తానికి 40 లోనూ అందం విషయంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఇలాంటి పిక్స్ తో ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తుంది.

తాజా మినీ డ్రెస్ లో క్లీ వేజ్ షో చేయడంతో పాటు థైస్ అందాలను చూపిస్తూ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌ కన్నుల విందు చేస్తుంది. ఇంకా కూడా యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలుస్తూ ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున కమిట్‌ అవుతూ వస్తుంది.

ఇటీవల విజయ్‌ సేతుపతితో కలిసి మెరీ క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కత్రీనా కైఫ్‌ నటన కి మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్య కాలంలో గ్లామర్‌ పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేస్తూ ఉంది. మరో పదేళ్ల పాటు కత్రీనా అందం కత్తిలాంటి అందం అనడంలో సందేహం లేదు.