జర్మనీలో కత్రినాకి ఏం పనబ్బా?
ఆ మధ్య అమెరికాలో ప్రత్యక్షమైన అమ్మడు తాజాగా జర్మనీ అందాల్లో విహరిస్తుంది.
By: Tupaki Desk | 10 July 2024 11:36 AM GMTకొన్ని నెలలుగా కత్రినా కైఫ్ ఇండియాలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మధ్య అమెరికాలో ప్రత్యక్షమైన అమ్మడు తాజాగా జర్మనీ అందాల్లో విహరిస్తుంది. స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేసింది. చారల షర్ట్ లో అమ్మడు గుడ్ మార్నింగ్ అంటూ మెసెజ్ పోస్ట్ చేసింది. ఇందులో క్యాట్ ముఖంలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తున్నాయి. మునుపటి కంటే మరింత గ్లోగా, చబ్బీ లుక్ లో హైలైట్ అవుతుంది.
అలాగే ధరించిన షర్ట్ శరీరానికి ఎంతో సౌకర్యవంతంగా వదులుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మరి క్యాట్ జర్మనీ ఎందుకెళ్లినట్లు? అన్నది మాత్రం మిస్టరీ. అమ్మడు కొంత కాలంగా విదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లింది. అటుపై ఇండియాకి తిరిగొచ్చి కొన్నాళ్లు ఇక్కడ ఉంది. తాజాగా మళ్లీ జర్మనీ ట్రిప్ లో ప్రత్యక్షమైంది.
మరి ఇలా విదేశాలకు ఎందుకు వెళ్తున్నట్లు? కొత్త సినిమాలు ఎందుకు చేయడం లేదు? ఏంటి సంగతి అంటే? మాత్రం సరైన సమాధానం దొరకదు. ఒకవేళ గర్భవతి కావడంతోనే సినిమాలు చేయలేదని నెట్టిట ప్రచారం సాగితే అలాంటిదేమి లేదు..ఏదైనా ఉంటే నేను చెబుతానంటూ ఇటీవలే భర్త విక్కీ కౌశల్ ధీటుగా స్పందించాడు. అంతవరకూ కత్రినా గర్భవతి కావడంతోనే సినిమాలు చేయలేదని, ప్రసవం కోసమే విదేశాలకు వెళ్లిందని ప్రచారం సాగింది.
కానీ విక్కీ కౌశలో ఖండించడంతో అది నమ్మడానికి వీలు లేదు. దీంతో కత్రినా వెనుక అసలేం జరుగుతుందో అర్దం కాని గందరగోళంలో అభిమానులు కనిపిస్తున్నారు. అమ్మడు చివరి సారిగా విజయ్ సేతు పతితో నటించిన `మేరీ క్రిస్మస్` లో కనిపించింది. అప్పటి నుంచి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు. కారణం ఏంటో తెలియని పరిస్థితి అభిమానులది.