Begin typing your search above and press return to search.

అర్ద‌రాత్రి రోడ్ల‌పై హీరోయిన్ రైడ్!

'జింద‌గీ నా మిలేగీ దొబారా' సినిమా స‌మ‌యం లోనే నేను బండి న‌డ‌ప‌డం నేర్చుకున్నాను. ఆ స‌మ‌యంలో అర్ద‌రాత్రి త‌ర్వాత మోటార్ సైకిల్ తీసుకుని రోడ్ల‌పైకి వ‌చ్చేదాన్ని.

By:  Tupaki Desk   |   24 Dec 2023 7:32 AM GMT
అర్ద‌రాత్రి రోడ్ల‌పై హీరోయిన్ రైడ్!
X

బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ వెండి తెర సాహ‌సాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోల‌తో స‌మానంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో సైతం స‌త్తా చాట‌గ‌ల న‌టి. సాహ‌సోపేత‌మైన పాత్ర‌ల్లో త‌న‌దైన ముద్ర వేసిన న‌టి. బైక్ రైడింగ్..కార్ రైడింగ్ లాంటి స‌న్నివేశాల్లో క్యాట్ క‌నిపించిందంటే? థియేట‌ర్లో విజిల్స్ ప‌డాల్సిందే. అమ్మ‌డి రైడింగ్ స్పీడ్ కి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవ‌లే 'టైగ‌ర్ -3' లోనూ ట‌వ‌ల్ ఫైట్ తో ఏ రేంజ్ లో ఆక‌ట్టుకుందో తెలిసిందే.


సినిమా స‌క్సెస్ లో క్యాట్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తాజాగా అమ్మ‌డు 'మేరి క్రిస్మ‌స్' లో సైతం సాహ‌సాలు చేసింద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌చారంలో భాగంగా సినిమా కోసం రోడ్ ట్రిప్ లు కూడా చేసిందిట‌. ఆ సంగ‌తులేంటో అమ్మ‌డి మాట‌ల్లోనే... 'జింద‌గీ నా మిలేగీ దొబారా' సినిమా స‌మ‌యం లోనే నేను బండి న‌డ‌ప‌డం నేర్చుకున్నాను. ఆ స‌మ‌యంలో అర్ద‌రాత్రి త‌ర్వాత మోటార్ సైకిల్ తీసుకుని రోడ్ల‌పైకి వ‌చ్చేదాన్ని.

మొద‌ట్లో బండి నేర్చుకోవ‌డం కోసం స్పెయిన్ లోని డుకాటీ ట్రైనింగ్ స్కూల్ కి పంపారు. తిరిగొచ్చిన త‌ర్వాత బాంద్రాలో మా ఇంటి నుంచి య‌శ్ రాజ్ స్టూడియో వ‌ర‌కూ రైడింగ్ కి వెళ్లే దాన్ని. ఆ స‌మ‌యంలో కూడా ట్రాపిక్ కార‌ణంగా న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌య్యేది. త‌ర్వాత నెమ్మ‌దిగా నేర్చుకున్నాను. ఈ స‌మ‌యంలో బండి నేర్ప‌డానికి ఓ వ్య‌క్తిని నియ‌మించుకున్నాను. ఆ వ్య‌క్తి ఎవ‌రు? అన్న‌ది ర‌హ‌స్యం.

ఎవ‌రికీ చెప్ప‌ద‌లుచుకోలేదు. బాగా ప్రాక్టీస్ చేసిన త‌ర్వాత రైడింగ్ ల‌కు వెళ్లాను. కానీ ఏ రోడ్ అన్న‌ది టాప్ సీక్రెట్' అనేసింది. అమ్మ‌డు మొత్తానికి బైక్ నేర్చుకున్న త‌ర్వాత చాలా విన్యాసాలే చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా బైక్ న‌డ‌ప‌డంలో? దీపికా ప‌దుకొణే కూడా స్పెష‌లిస్ట్. అమ్మ‌డు బైక్ పై స్టంట్లు చేయ‌డంలో ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకుంది.