కత్రినా-విక్కీ కౌశల్ పిల్లల ప్లానింగ్ ఇలా!
అయితే తాజాగా ఓ సందర్భంలో భర్త విక్కీ కౌశల్ పిల్లల విషయంలో ఆ దంపతులు ఏమనుకుంటున్నారో రివీల్ చేసారు.
By: Tupaki Desk | 16 Sep 2023 2:30 AM GMTకత్రినా కైఫ్-విక్కీ కౌశల్ ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే విదేశాలకు చెక్కేస్తారు. వారం పది రోజుల పాటు వెకేషన్ ఎంజాయ్ చేసి తిరిగొస్తారు. మళ్లీ యధావిధిగా ఎవరి షూటింగ్ ల్లో వాళ్లు బిజీ అవుతారు. అయితే కత్రినా పిల్లలు కనడానికి ఆసక్తిగా ఉందని...గర్భం దాల్చడం కోసం సినిమాలకు బ్రేక్ కూడా ఇస్తుందని ఇప్పటికే బాలీవుడ్ మీడియా కథనాలు వెడెక్కించాయి.
క్యాట్ సోషల్ మీడియాకి దూరంగా ఉండటంతో ఈ కథనాలు తారా స్థాయికి చేరాయి. కత్రినా గర్భం దాల్చిందని..అందుకే మీడియా ముందుకు రావడం లేదని ప్రచారం సాగింది. అయితే తాజాగా ఓ సందర్భంలో భర్త విక్కీ కౌశల్ పిల్లల విషయంలో ఆ దంపతులు ఏమనుకుంటున్నారో రివీల్ చేసారు. పిల్లల విషయంలో మేము ఏమాత్రం తొందరపడలేదు. ఆ సమయం వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది.
ఇంట్లో మా పెద్దలు కూడా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కాబట్టి ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. మీడియాలో జరిగిందంతా ప్రచారమాత్రమే'అన్నారు. అలాగే కత్రినా స్టార్ హీరోయిన్ అనే హోదా చూసి ప్రేమించలేదు. ఆమె మంచి మనసులు తెలుసుకుని ఇష్టపడ్డా. రోజులు గడిచే కొద్ది ప్రేమ పెరిగింది. ఆమె అటెన్షన్ పొందడం చాలా కష్టం అనిపించింది. అలాంటి సమయంలోనే ఆమె నా గురించి ఓ ఈవెంట్ లో మాట్లాడారు.
ఆ విషయం తెలిసి ఎంతో ఆనందించా. నిజంగానే ఆమె నా గురించి మాట్లాడారా? అని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. తర్వాత కొంత కాలానికి పరిచయం ఏర్పడింది. అటుపై ప్రేమ..పెళ్లి జరిగాయి' అని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. దేశ భక్తి నేపథ్యం గల సినిమాలు చేయాలంటే బాలీవుడ్ మేకర్స్ విక్కీ నే గుర్తొస్తాడు. ఆ స్థాయిలో ఉరి సక్సెస్ తర్వాత మేకర్స్ పై ప్రభావం చూపిస్తున్నాడు.