Begin typing your search above and press return to search.

కోటి రూపాయల ప్రశ్నకు ఆన్సర్ ఇదే..!

ఈ సీజన్ లో కూడా అమితాబ్ బచ్చన్ తన ఎనర్జిటిల్ హోస్టింగ్ తో అదరగొడుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 9:44 AM GMT
కోటి రూపాయల ప్రశ్నకు ఆన్సర్ ఇదే..!
X

బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న కోన్ బనేగా కరోడ్ పతి షో ఎంత పెద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఓ పక్క సిల్వర్ స్క్రీన్ మీద అదరగొడుతున్న ఆయన ఇటు రియాలిటీ షోతో కూడా మెప్పిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు కోన్ బనేగా కరోడ్ పతి 15 సీజన్లు పూర్తి చేసుకోగా ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తుంది. ఈ సీజన్ లో కూడా అమితాబ్ బచ్చన్ తన ఎనర్జిటిల్ హోస్టింగ్ తో అదరగొడుతున్నారు.

ఐతే ప్రస్తుత సీజన్ లో ఒక కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రశ్న దాకా వెళ్లగా అతన్ని అడిగిన కోటి రూపాయల ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మన దేశంలో క్రికెట్ ప్రేమికులు ఎక్కువ అని తెలిసిందే. క్రికెట్ ని ఎంత ఇష్టపడతారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్స్ కి క్రికెట్ మీద ఉన్న ప్రేమ ఎలాంటిదే ఐ.పి.ఎల్ సీజన్ చూస్తే అర్ధమవుతుంది.

ఇదిలాఉంటే కోన్ బనేగా కరోడ్ పతి సీజన్ 16లో కోటి రూపాయల ప్రశ్నగా ఒక క్రికెట్ కు సంబందించిన ప్రశ్న అడిగారు. అదేంటి అంటే.. 1932 లార్డ్స్ లో భారత్ ఆడిన తొలి టెస్ట్ లో మొదటి బంతి ఫేస్ చేసిన ఆట గాడు ఎవరని అడిగారు. ఆ ప్రశ్నకు ఆప్షన్స్ గా ఏ. జనార్ధన్ నవ్లే బి. సోరాబ్జీ కోలాహ్ సి. లాల్ సింగ్ డి. ఫిరోజ్ పలియా ఇచ్చారు. ఐతే ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉండగా ఈ కోటి రూపాయల ప్రశ్నకు ఆన్సర్ చాలామందికి తెలియదు.

ఐతే హాట్ సీటులో ఉన్న వ్యక్తి ఈ ఆన్సర్ చెప్పాడా లేదా అన్నది తెలియదు కానీ ఈ ప్రశ్నకు ఆన్సర్ మాత్రం అందరు వెతికేస్తున్నారు. ఐతే ఈ ప్రశ్నకు ఆన్సర్ సోరాబ్జీ కొలాహ్. ఆయనే మన తొలి టెస్ట్ క్రికెట్ లో మొదటి బంతి ఆడాడు. క్రికెట్ అభిమానులకు కూడా ఈ ప్రశ్న ఆశ్చర్యకరం అనిపించింది. ఐతే ఆన్సర్ ని తెలిసి చెప్పడం కన్నా ఏదో ఒకటి గెస్ చేయాలి కదా అని చెబుతున్నారు. మొత్తానికి కోటి రూపాయల ప్రశ్న నిజంగానే కోటి రూపాయలు అనిపించేలా చేసింది.