కావ్య పాప గ్లామర్ ఫీస్ట్
ఈ లుక్స్ లో కావ్య కళ్యాణ్ రామ్ మెస్మరైజ్ చేస్తోందనే మాట వినిపిస్తోంది. తన అందానికి కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ కుర్రాళ్ళకి విజువల్ ఫీస్ట్ అందిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి.
By: Tupaki Desk | 19 Dec 2024 5:00 PM GMTగంగోత్రి, బాలు సినిమాలలో చైల్డ్ యాక్టర్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ ను అంత ఈజీగా ఎవరూ మర్చిపోరు. ఈ పిల్లి కళ్ళ పాప ‘మసూద’ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి చిత్రంతోనే సక్సెస్ అందుతుంది. తర్వాత ‘బలగం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. ఈ రెండు సినిమాలు ఆమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత శ్రీ సింహకు జోడీ ‘ఉస్తాద్’ సినిమాలో ఈ బ్యూటీ నటించింది. అయితే ఈ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఈ మూవీ తర్వాత ఇప్పటివరకు కావ్య కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలతో ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ అమ్మడు ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఎలాంటి ఫోటోలు పెట్టిన వైరల్ అవుతూ ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ గౌన్ లో అదిరిపోయే లుక్స్ తో గ్లామర్ ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ లో కావ్య కళ్యాణ్ రామ్ మెస్మరైజ్ చేస్తోందనే మాట వినిపిస్తోంది. తన అందానికి కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ కుర్రాళ్ళకి విజువల్ ఫీస్ట్ అందిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోలు పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆమె అందాన్ని వర్ణిస్తూ ఎమోజీలు పెడుతున్నారు. తెలుగు అమ్మాయిలను తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ గా ఎంకరేజ్ చేయడం లేదనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. కావ్య కళ్యాణ్ రామ్ లాంటి హీరోయిన్స్ కి సరైన అవకాశాలు ఇస్తే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటే అందం ఆమెకు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ స్థాయిలో గ్లామర్ ఫోటోలను చూసిన తర్వాత ఎవరైన సరే కావ్యకి పిలిచి మరి అవకాశాలు ఇస్తారనే కామెంట్స్ చేస్తున్నారు.