Begin typing your search above and press return to search.

న‌టిగా స‌త్తా చాటినా బ్యాడ్ ల‌క్

అయితే కావ్య తిరిగి కంబ్యాక్ అవ్వాలంటే స‌రైన కాంపౌండ్ లో పెద్ద హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 3:30 AM GMT
న‌టిగా స‌త్తా చాటినా బ్యాడ్ ల‌క్
X

తాను న‌టించిన సినిమాలు ఎలా ఉన్నా కానీ, త‌న న‌ట‌న ఎలా ఉందో ప్ర‌జ‌లు ప‌సిగ‌డితే చాలు.. అదే ఏ న‌టికి అయినా పెద్ద అవార్డు. ఇప్పుడు అలాంటి అవార్డు అందుకుని, రివార్డు లేక ఇబ్బంది ప‌డుతోంది కావ్య థాప‌ర్. కెరీర్ లో పెద్ద సినిమాలు ప‌డినా కానీ, త‌న న‌ట‌న‌కు అంద‌చందాల‌కు మంచి పేరొచ్చినా కానీ, సినిమాల‌న్నీ ఫ్లాపుల‌వ్వ‌డంతో అది దుర‌దృష్టంగా మారింది స‌ద‌రు క‌థానాయిక‌కు...

మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న -ఈగ‌ల్, ఎన‌ర్జిటిక్ హీరో రామ్ స‌ర‌స‌న -డబుల్ ఇస్మార్ట్ లో న‌టించింది కావ్య థాప‌ర్. ఈ రెండు సినిమాల్లో గ్లామ‌ర్ కి ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించింది. కావ్య అంద‌చందాలు న‌ట‌న డ్యాన్సుల‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. కానీ ఏం లాభాం? ఆ రెండు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. క‌నీసం గోపిచంద్ విశ్వం చిత్రంతో అయినా కంబ్యాక్ అవ్వాల‌ని కావ్య ప్ర‌య‌త్నించింది.

కానీ ఇప్పుడు అదే ఫ‌లితం రిపీటైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత రేంజుకు చేరుకోలేక‌పోయింది. కావ్య పాత్ర‌కు న‌టించేందుకు ఆస్కారం ఉన్నా దానివ‌ల్ల ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. దీంతో ప్ర‌తిభ ఉండీ రేసులో వెన‌క‌బ‌డిన క‌థానాయిక‌ల జాబితాలో చేరిపోయింది. అయితే కావ్య తిరిగి కంబ్యాక్ అవ్వాలంటే స‌రైన కాంపౌండ్ లో పెద్ద హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకోవాల్సి ఉంటుంది.