Begin typing your search above and press return to search.

కావ్య కిల్లింగ్ లుక్స్.. ఏమా అందం?

ఇక కొన్నేళ్ల తర్వాత మసూద సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కావ్య.

By:  Tupaki Desk   |   2 May 2024 4:24 PM GMT
కావ్య కిల్లింగ్ లుక్స్.. ఏమా అందం?
X

అప్పుడెప్పుడో 21 ఏళ్ల క్రితం విడుదలైన గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ అందరినీ ఫిదా చేసిన కావ్య కళ్యాణ్ రామ్.. ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తోంది. గంగోత్రి మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టింది. తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలు మూవీలో నటించి అదరగొట్టేసింది. అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.


ఇక కొన్నేళ్ల తర్వాత మసూద సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ ‏గా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత బలగం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో కావ్య క్రేజ్ మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు అందుకుంది. బలగం తర్వాత ఉస్తాద్ లో నటించింది.

ఇక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది కావ్య కళ్యాణ్ రామ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ పలకరిస్తుంటోంది. తన ఫ్యాన్స్ తో ఫుల్ టచ్ లో ఉంటోంది. డైలీ అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ట్రెడిషనల్ తోపాటు ట్రెండీ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటోంది. రకరకాల పోజులు ఇస్తూ అందరినీ ఫిదా చేస్తుంటోంది. ప్రస్తుతం కావ్యకు ఇన్ స్టాలో 3.67 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

తాజాగా కొత్త పిక్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. ట్రెండీ మినీ ఫ్రాక్ లో గ్లామర్ షో చేస్తోంది. థైస్ షో చేస్తూ అందరినీ ఫ్లాట్ చేస్తోంది. ఓరగా చూస్తూ కుర్రకారును మాయ చేస్తోంది కావ్య కళ్యాణ్ రామ్. కిల్లింగ్ లుక్స్ తో మతులు పోగుడుతుంటోంది. కర్లీ హెయిర్ తో ఓ రేంజ్ లో అలరిస్తోంది. ప్రస్తుతం నెట్టింట కావ్య కొత్త పిక్ వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు.. గంగోత్రి పాప నయా ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కావ్య కళ్యాణ్ రామ్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కిల్లింగ్ లుక్స్ అంటూ కొనియాడుతున్నారు. రోజురోజుకు అందం పెరిగిపోతుందని పొగిడేస్తున్నారు. తమ కామెంట్లతో ఆకాశానికెత్తేస్తున్నారు. అందానికి ఇమేజ్ కావ్య అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

కొత్త సినిమా అప్డేట్స్ కావాలంటూ మరికొందరు నెటిజన్లు అడుగుతున్నారు. మరి మీరు కావ్య అందాన్ని చూశారా?