Begin typing your search above and press return to search.

కావ్య రింగ్స్ వెనుక పెద్ద కథే.. స్టన్నింగ్ స్టిల్

కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరు వింటే చాలు.. బలగం మూవీ టక్కున గుర్తు వచ్చేస్తుంది.

By:  Tupaki Desk   |   10 May 2024 10:37 AM GMT
కావ్య రింగ్స్ వెనుక పెద్ద కథే.. స్టన్నింగ్ స్టిల్
X

కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరు వింటే చాలు.. బలగం మూవీ టక్కున గుర్తు వచ్చేస్తుంది. ఆ సినిమాలో కమెడియన్, హీరో ప్రియదర్శికి జోడీగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతకుముందు మసూదలో హీరోయిన్ గా నటించినా.. బలగం చిత్రంతోనే ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి హిట్లు కొట్టాలని ట్రై చేస్తోంది ఈ బలగం పాప.


అయితే కావ్య.. అల్లు అర్జున్ 'గంగోత్రి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'బాలు', చిరంజీవి 'ఠాగూర్', ప్రభాస్ 'అడవి రాముడు' సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించింది. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు వస్తున్నా.. సినిమాలు వదిలేసి ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెట్టింది. 2008 నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాలు చేసేందుకు ఆడిషన్స్ ఇచ్చింది.


అలా మసూద మూవీలో ఛాన్స్ కొట్టేసింది కావ్య. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో మెప్పించింది. ఆ తర్వాత బలగం మూవీతో మంచి హిట్ కొట్టింది. అనంతరం సింహా కోడూరి హీరోగా వచ్చిన ఉస్తాద్ లో నటించింది. నటనతో కావ్య మెప్పించినా.. ఆ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఆమె పలు ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త మూవీ అనౌన్స్ చేయనుందట కావ్య


అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. కొద్దిరోజులుగా వరుసగా ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తోంది కావ్య. గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలు ఆరబోస్తోంది. రీసెంట్ గా నల్ల రైక, ఎర్ర చీర కట్టుకుని అందరినీ ఫిదా చేసింది. భరత నాట్యం భంగిమలతో ఆకట్టుకుంది. ఓర చూపులతో ఫ్లాట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు వెళ్లింది. అక్కడ దిగిన పిక్స్ ను షేర్ చేసింది.

పలుచని కాటన్ క్లాత్ తో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని స్మైలీ ఫేస్ తో క్యూట్ పోజులిచ్చింది కావ్య. కానీ లాస్ట్ పిక్ లో వెరైటీగా స్టిల్ ఇచ్చింది. క్యాప్షన్ లో తన ఇయర్ రింగ్స్ కోసం చెప్పింది. బర్త్ డేకి తన ఫ్రెండ్ అవి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిపింది. తాను లిల్లీ (బాలు మూవీలో ఆమె చేసిన రోల్ పేరు) అని, అందుకే ఆమె ఆ ఇయర్ రింగ్స్ ఇచ్చిందని చెప్పింది. ప్రస్తుతం కావ్య కొత్త పిక్స్ వైరల్ గా మారాయి. మండే వేసవిలో కావ్య పోజులకు పుట్టే సెగలను తట్టుకోలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.