Begin typing your search above and press return to search.

కావ్య పాప గురించి కెవ్వు కేక పెట్టించే విషయాలు ఇవే!

కావ్య మారన్‌ గురించి తెలియనివారు లేరు. ఆమెను ఐపీఎల్‌ క్రికెట్‌ ప్రియులు ముద్దుగా కావ్య పాప అని పిలుస్తుంటారు

By:  Tupaki Desk   |   26 April 2024 1:30 AM GMT
కావ్య పాప గురించి కెవ్వు కేక పెట్టించే విషయాలు ఇవే!
X

కావ్య మారన్‌ గురించి తెలియనివారు లేరు. ఆమెను ఐపీఎల్‌ క్రికెట్‌ ప్రియులు ముద్దుగా కావ్య పాప అని పిలుస్తుంటారు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ కు అధిపతి అయిన కావ్య పాప.. తన టీమ్‌ ఆడే మ్యాచులకు హాజరై సందడి సందడి చేస్తూ ఉంటుంది. తమ టీమ్‌ డ్రస్‌ అయిన ఆరెంజ్‌ టీ షర్టులు ధరించి కావ్య పాప ఇచ్చే ఎక్సప్రెషన్స్‌ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ ఉన్నారు.

తమ టీమ్‌ అద్భుతంగా ఆడితే కావ్య పాప ఎగిరి గంతులేసి సంబరాలు జరుపుకుంటుంది. అదే ఓడిపోతుంటే మాత్రం కావ్య పాప ఎక్సప్రెషన్స్‌ పాపం చాలా డల్లుగా ఉంటాయి. అయ్యో.. కావ్య పాప అని అభిమానులు కూడా నిట్టూరుస్తుంటారు.

కాగా ప్రస్తుతం ఐపీఎల్‌ లో కావ్య పాప సన్‌ రైజర్స్‌ టీమ్‌ దుమ్ములేపుతోంది. పాయింట్ల టేబుల్‌ లో పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడి ఐదు మ్యాచులు గెలుపొందింది. అంతేకాకుండా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌ రైజర్స్‌ రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో తాను సృష్టించిన రికార్డును తానే బ్రేక్‌ చేసింది.

దీంతో కావ్య పాప ఫుల్‌ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో కావ్య పాప గురించి మీకు తెలియని విషయాలు ఇవి.. కావ్య మారన్‌ సన్‌ టీవీ అధిపతి కళానిధి మారన్‌ కుమార్తె. ఈ కళానిధి మారన్‌ ఎవరో కాదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మేనల్లుడు. అంతేకాకుండా కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌ కు కళానిధి సోదరుడు. కళానిధి మారన్‌ సతీమణి కావేరీ మారన్‌ సోలార్‌ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్‌ సీఈవోగా పనిచేస్తున్నారు.

జెమినీ టీవీ కూడా సన్‌ టీవీ నెట్‌ వర్క్‌ లోనే ఉంది. రూ.33 వేల కోట్ల సన్‌ గ్రూప్‌ వ్యాపార సామ్రాజ్యానికి కావ్య మారన్‌ ఒక్కటే వారసురాలు. కావ్య మారన్‌ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.417 కోట్లుగా ఉండటం విశేషం.

కళానిధి మారన్‌ ముద్దుల కుమార్తె అయిన కావ్య మారన్‌ చెన్నైలోని స్టెల్లా మేరీస్‌ కాలేజీలో కామర్స్‌ లో డిగ్రీ చదివింది. అలాగే యూకేలో ఎంబీఏ చదువుకుంది. 1992 ఏప్రిల్‌ 6న చెన్నైలో పుట్టిన కావ్య మారన్‌ వయసు 31.

ప్రస్తుతం తన తండ్రితోపాటు సన్‌ టీవీ నెట్‌ వర్కుతోపాటు సన్‌ రైజర్స్‌ టీమ్‌ బాధ్యతలను కావ్య మారన్‌ చూసుకుంటున్నారు.

కాగా కావ్యపాపకు కార్లంటే మోజు ఎక్కువేనని తెలుస్తోంది. కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు ఆమె వద్ద ఉన్నాయి. రూ.12.2 కోట్లు విలువ చేసే రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారు కూడా కావ్య పాప వద్ద ఉంది. అలాగే రూ.6 కోట్లు విలువ చేసే బెంట్లీ, రూ.3.76 కోట్ల విలువైన ఫెరారీ రోమా, రూ.2 కోట్లకు పైగా విలువైన బీఎండబ్ల్యూ వంటి ఎన్నో కార్లు ఆమె కలెక్షన్‌ లో ఉన్నాయి.