Begin typing your search above and press return to search.

చీరకట్టులో బలగం కావ్య.. స్టన్నింగ్

సంక్రాంతి స్పెషల్ గా చీర కట్టుకుని ఫొటోలు దిగింది ఈ అమ్మడు. పండుగ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. భోగి మంటలు వెలుగుతున్నట్లు కామెంట్లు ఉండాలంటూ క్యాప్షన్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 9:30 AM GMT
చీరకట్టులో బలగం కావ్య.. స్టన్నింగ్
X

తెలుగులో ఎన్నో చిత్రాల్లో బాలనటిగా నటించి అలరించిన కావ్య కళ్యాణ్ రామ్.. బలగం సినిమాతో సూపర్ ఫేమ్ సంపాదించుకుంది. 2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ప్రియదర్శికి జంటగా నటించి తన సహజ నటనతో ఆకట్టుకుంది. ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.


సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను అప్డేట్ చేస్తూ సందడి చేస్తుంటోంది. క్రేజీ ఔట్ ఫిట్స్ లో దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటోంది. మోడ్రన్ డ్రెస్సులతోపాటు చీరలు, హాఫ్ శారీల్లో కూడా అందాలను ఆరబోస్తోంది. కుర్రకారు మతులను పోగొడుతోంది.


సంక్రాంతి స్పెషల్ గా చీర కట్టుకుని ఫొటోలు దిగింది ఈ అమ్మడు. పండుగ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. భోగి మంటలు వెలుగుతున్నట్లు కామెంట్లు ఉండాలంటూ క్యాప్షన్ ఇచ్చింది. కావ్య కొత్త పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చీరకట్టులో ముద్దుగుమ్మ కుందనపు బొమ్మలా కనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతి పండగంతా ఈ అమ్మడి చిరునవ్వులోనే దాగుని ఉందని అంటున్నారు. వైలట్ కలర్ బ్లౌజ్, క్రీమ్ కలర్ శారీలో అమ్మడి లుక్ అదిరిపోయిందని చెబుతున్నారు.


గంగోత్రి, స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, బన్నీ, సుభాష్ చంద్రబోస్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది కావ్య. గతేడాది మసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హారర్ జోనర్ లో తెరకెక్కిన ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో కావ్య పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేసింది.


ఇక రెండో సినిమా బలగంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీకి గాను అనేక అవార్డులను కూడా దక్కించుకుంది. వరుస రెండు హిట్ లు కొట్టిన ఈ బ్యూటీ నటించిన మూడో సినిమా ఫ్లాప్ అయింది. కోడూరి సింహ హీరోగా నటించిన ఉస్తాద్ మూవీతో హ్యట్రిక్ కొడదామనుకున్న కావ్యకు నిరాశే ఎదురైంది. మరి కావ్య కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.