Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్లు అంద‌రికంటే పూరి భామ డిఫ‌రెంట్!

పుట్టిన రోజు వ‌చ్చిందంటే? హీరోయిన్లు అంతా ఏ రేంజ్ లో సెల‌బ్రేట్ చేసుకుంటారో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   21 Aug 2024 6:58 AM GMT
ఆ హీరోయిన్లు అంద‌రికంటే పూరి భామ డిఫ‌రెంట్!
X

పుట్టిన రోజు వ‌చ్చిందంటే? హీరోయిన్లు అంతా ఏ రేంజ్ లో సెల‌బ్రేట్ చేసుకుంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ ప‌బ్ ని బుక్ చేసి స్నేహితుల్ని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇస్తారు. డే అంతా పుల్ గా ఎంజాయ్ చేస్తారు. అందుకోసం ల‌క్ష‌లు ఖ‌ర్చు అవ్వొచ్చు. కోట్ల రూపాయ‌లైన ఖ‌ర్చు అవ్వొచ్చు. వాళ్ల స్థోమ‌తని బ‌ట్టి ఖ‌ర్చు జ‌రుగుతుంది. కానీ ఈ భామ మాత్రం అలాంటి వారంద‌రికీ భిన్నం.

అదే డ‌బ్బును ఆశ్ర‌మం కోసం..అందులో పిల్ల‌ల కోసం ఖ‌ర్చు చేస్తుంది. ఇంత‌కీ ఎవ‌రా భామ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఆమె ఎవ‌రో కాదు కావ్యా థాప‌ర్. ఇటీవ‌ల రిలీజ్ అయిన `డ‌బుల్ ఇస్మార్` హీరోయిన్. ఈ అమ్మ‌డు సినిమా రిలీజ్ కి ముందు పెళ్లి చేసుకోన‌ని...జీవితంలో సింగిల్ గా ఉండ‌ట‌మే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పింది. ఇలా చెబుతారు గానీ చేస్తారా? అనుకుంటాం.

కానీ ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా వేడుక‌లను అనంత్ థామ్ అనే ఆశ్ర‌మంలో జ‌రుపుకుంది. పెళ్లి చేసుకోను అని చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆశ్ర‌మంలో పుట్టిన రోజు జ‌రుపుకోవ‌డంతో? ఆమె నిజంగానే అవివాహితిగా ఉండిపోతుందా? అన్న సందేహాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. క‌షాయం ధ‌రించిన సన్యాసితో క‌లిసి పుట్టిన జరుపుకోవ‌డం..అక్క‌డ పిల్ల‌ల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేయ‌డం వంటివి చూస్తుంటే? కావ్యాథాప‌ర్ కి సామాజిక సేవ అంటే ఆస‌క్తి అని తెలుస్తోంది.

ఆశ్ర‌మంలో దిగిన కొన్ని సెల్పీల‌ను నెట్టింట పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. మొత్తానికి అమ్మ‌డు ఈ ర‌కంగా నెటి జ‌నుల మ‌న‌సు గెలుచుకుంది. ల‌క్ష‌ల రూపాయ‌లు పార్టీ పేరుతో ఖ‌ర్చు చేయ‌కుండా ఆశ్ర‌మం పిల్ల‌ల‌కు కేటాయించ‌డం...వారి స‌మ‌క్షంలో బ‌ర్త్ డే జ‌రుపుకోవ‌డంపై అంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.