Begin typing your search above and press return to search.

'ఈగల్‌' బ్యూటీ గ్లామర్‌ డోస్‌ పెంచిందా..!

అయితే ఆ సినిమా ఓటీటీ సినిమా అవ్వడం వల్ల రావాల్సిన ఆఫర్లు ఈ అమ్మడికి రాలేదు అనేది సినీ విశ్లేషకులు మరియు ఆమె సన్నిహితుల మాట.

By:  Tupaki Desk   |   13 Aug 2024 10:47 AM GMT
ఈగల్‌ బ్యూటీ గ్లామర్‌ డోస్‌ పెంచిందా..!
X

ఈ మాయ పేరేమిటో సినిమాతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ కావ్య థాపర్‌. మొదటి సినిమా తో పెద్దగా గుర్తింపు రాకున్నా కూడా ప్రయత్నాలు ఆపలేదు. తమిళంలో ఈమె సినిమాలు వరుసగా చేస్తూ వచ్చింది. తెలుగు లో మరోసారి కావ్య థాపర్ కి ఏక్‌ మినీ కథ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా ఇండస్ట్రీ గుర్తింపు దక్కించుకుంది. అయితే ఆ సినిమా ఓటీటీ సినిమా అవ్వడం వల్ల రావాల్సిన ఆఫర్లు ఈ అమ్మడికి రాలేదు అనేది సినీ విశ్లేషకులు మరియు ఆమె సన్నిహితుల మాట.


రవితేజ కు జోడీగా ఈగల్‌ సినిమాలో నటించే అవకాశంను ఈ అమ్మడు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లో పెద్ద హీరోతో నటించింది అనుకుంటున్న సమయంలోనే ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో కాస్త నిరుత్సాహం కు గురి అయ్యింది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌ లో ఆఫర్లు వస్తాయో లేదో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాలో రామ్‌ కు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాపై కావ్య థాపర్ ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తోంది.

మిడిల్‌ క్లాస్‌ లవ్‌ చిత్రంతో హిందీలో అడుగు పెట్టిన ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. కానీ తమిళంలో మాత్రం ఈ అమ్మడు పిచ్చైక్కారన్‌ 2 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని అక్కడ వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో సమాంతరంగా సినిమాలు చేస్తున్న కావ్య థాపర్‌ కి ముందు ముందు భారీ ఆఫర్లు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె డబుల్‌ ఇస్మార్ట్‌ ఫలితం పైనే అంతా ఆధారపడి ఉంటుంది అనే అభిప్రాయం ను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల ఫలితం తో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా తన ఫాలోవర్స్ సంఖ్య ను భారీగా పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫోటోలను చూస్తే కావ్యా థాపర్‌ ఈ మధ్య కాలంలో గ్లామర్‌ డోస్‌ పెంచిందే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. వైట్ షర్ట్‌ ధరించి పై బటన్స్ ను తొలగించి, కవ్వించే చూపులతో నెటిజన్స్ చూపు తిప్పుకోనివ్వని అందం కావ్య థాపర్‌ అందం అనిపిస్తుంది. ఈ స్థాయి లో అందంగా ఉన్న కావ్య థాపర్ కి మరిన్ని సినిమాల్లో ఆఫర్లు రావాలి, స్టార్‌ హీరోయిన్‌ పీస్ అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు.