Begin typing your search above and press return to search.

ముద్దుగుమ్మకు ఒక్క రోజు రెండు పరీక్షలు

ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య థాపర్‌.

By:  Tupaki Desk   |   22 Jan 2024 11:00 PM IST
ముద్దుగుమ్మకు ఒక్క రోజు రెండు పరీక్షలు
X

ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య థాపర్‌. మోడలింగ్‌ లో రాణించడం ద్వారా సినిమా ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే సౌత్‌ లో ఈ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా ఆధరణ దక్కించుకోలేక పోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ అమ్మడికి మాస్ మహారాజా రవితేజ కు జోడీగా ఈగల్ లో నటించే అవకాశం దక్కింది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈగల్‌ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు గాను రీ షెడ్యూల్‌ చేసిన విషయం తెల్సిందే.

ఫిబ్రవరి 9న ఈగల్ సినిమాతో పాటు సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన సినిమా విడుదల అవ్వబోతుంది. ఈగల్ తో పాటు ఆ సినిమా లో కూడా కావ్య థాపర్ హీరోయిన్ అవ్వడం ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల యొక్క ప్రమోషన్ హడావుడి కూడా మొదలు అయ్యింది.

ఈగల్ సినిమా నిర్మాతలు సోలో రిలీజ్ ను కోరుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది క్లారిటీ లేదు. కనుక ఈగల్ తో పాటు అదే రోజున భైరవకోన సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒకే రోజు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా కావ్య థాపర్ కి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమాలు హిట్ అయితేనే ఆమె కొత్త సినిమా ఆఫర్లను దక్కించుకోగలదు. కనుక ఒకే రోజు రెండు పరీక్షలు ఎదుర్కోబోతున్న కావ్య థాపర్ కి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.