కయదు వీడియోస్ ట్రెండ్ చేస్తున్నారుగా..!
ఆ సినిమా చూసిన తమిళ ఆడియన్స్ ఆమె గురించి ఆహా ఓహో అనేస్తుంటే తెలుగు ఆడియన్స్ కూడా అమ్మడిని తెగ ఫాలో అవుతున్నారు.
By: Tupaki Desk | 5 March 2025 6:00 AM ISTప్రదీప్ రంగనాథన్ తో డ్రాగన్ సినిమాలో నటించిన కయదు లోహార్ కు ఆ సినిమాతో సూపర్ పాపులారిటీ వచ్చింది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక హీరోయిన్ కాగా ఆమె కన్నా కయదు యూత్ ఆడియన్స్ కు దగ్గరైంది. ముఖ్యంగా సినిమాలో ఆమె గ్లామర్ లుక్స్, యాక్టింగ్ అంతా నచ్చేసింది. డ్రాగన్ సినిమాతో కయదు లోహార్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా చూసిన తమిళ ఆడియన్స్ ఆమె గురించి ఆహా ఓహో అనేస్తుంటే తెలుగు ఆడియన్స్ కూడా అమ్మడిని తెగ ఫాలో అవుతున్నారు.
ఐతే కయదు లోహార్ ఆల్రెడీ తెలుగులో 3 ఏళ్ల క్రితమే ఒక సినిమా చేసింది. శ్రీ విష్ణు చేసిన అల్లూరి సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఐతే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆ టైం లో ఆమెను ఎవరు పట్టించుకోలేదు. కానీ డ్రాగన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అల్లూరి సినిమా క్లిప్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. డ్రాగన్ చూశాక ఆమెను మరింత ట్రెండ్ చేస్తున్నారు.
తెలుగు సోషల్ మీడియాలో కయదు లోహార్ ఒక ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అమ్మడి గురించి ప్రత్యేకమైన చర్చలు జరుపుతున్నారు. ఇక కయదుకి ఆఫర్లు కూడా వరుస కడుతున్నాయి. ఇప్పటికే అనుదీప్, విశ్వక్ సేన్ కాంబో సినిమా ఫంకీలో అమ్మడు ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.
కయదు కూడా తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమకు సూపర్ హ్యాపీగా ఉంది. తెలుగులో ఒక్కసారి క్లిక్ అయితే ఆ హీరోయిన్ కి స్టార్ రేంజ్ వచ్చినట్టే లెక్క. తెలుగులో స్టార్ స్టేటస్ వస్తే మిగతా అన్ని భాషల్లో కూడా అదే రేంజ్ ఆఫర్లు వస్తాయి. సో డ్రాగన్ సినిమా వల్ల హీరో ప్రదీప్ రంగనాథన్, డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుకి ఎంత పేరు వచ్చిందో హీరోయిన్ గా కయదు లోహార్ కి అంతకుమించి పాపులారిటీ వచ్చింది.
తెలుగు సోషల్ మీడియాలో అయితే గత కొద్ది రోజులుగా కయదు స్పెషల్ టాపిక్ గా మారింది. తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి అమ్మడికి ఈసారి లక్ కలిసి వచ్చేలానే ఉంది. తమిళ్ లో కూడా ప్రస్తుతం కయదు ఇదయం మురళి సినిమాలో నటిస్తుంది.