ఫంకీ సెట్స్ లో జాయిన్ అయిన కాయదు
సితార బ్యానర్ లో ఆఫర్ కొట్టేయడమంటే ఓ రకంగా అమ్మడు బంపరాఫర్ కొట్టేసినట్టే అని చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే అనుదీప్- విశ్వక్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.
By: Tupaki Desk | 28 Feb 2025 9:46 AM GMTగతంలో మూడేళ్ల కిందట శ్రీ విష్ణు అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాయదు లోహర్ ఇప్పుడు రీసెంట్ గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీతో మరోసారి తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. అల్లూరి సినిమా డిజాస్టర్ అవడంతో కాయదుకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డ్రాగన్ మూవీతో అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది.
డబ్బింగ్ మూవీ అయినా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో కాయదు పై తెలుగు దర్శకనిర్మాతల ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అమ్మడుకు తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టు దక్కింది. విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కెవి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఫంకీ సినిమాలో కాయదు ఛాన్స్ కొట్టేసింది.
సితార బ్యానర్ లో ఆఫర్ కొట్టేయడమంటే ఓ రకంగా అమ్మడు బంపరాఫర్ కొట్టేసినట్టే అని చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే అనుదీప్- విశ్వక్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా సెట్స్ లో తాజాగా కాయదు జాయినైంది. హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, విశ్వక్ సేన్, కాయదు కాంబినేషన్ సీన్స్ ను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ముంబై భామ కాయదు, ఇప్పటికే తమిళం నేర్చేసుకుంది. అల్లూరి టైమ్ లోనే కొంచెం తెలుగును కూడా అర్థం చేసుకున్న ఈ భామ ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా క్యూట్ గా కొన్ని పదాలను పలుకుతోంది. ఇక సినిమా విషయానికొస్తే ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని అటు విశ్వక్ సేన్, ఇటు డైరెక్టర్ అనుదీప్ చూస్తున్నారు. ఫంకీ హిట్ అయితే కాయదుకి కూడా తెలుగులో మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి.
రీసెంట్ గా లైలా సినిమాతో డిజాస్టర్ అందుకున్న విశ్వక్ సేన్ ఇక మీదట తను నటించే ప్రతీ సీన్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా చేస్తానని తెలిపాడు. అనిరుధ్ పై ఎంతో నమ్మకంతో ఉన్న విశ్వక్ కు ఈ సినిమా అయినా తను కోరకుంటున్న హిట్ ను ఇస్తుందేమో చూడాలి.