Begin typing your search above and press return to search.

ఆ షోలో రోటీన్ కు భిన్నమైన సీన్.. బిగ్ బీని భలే ప్రశ్న అడిగింది

ప్రశ్నలు వేయటం.. సరైన సమాధానాలు చెబితే భారీ బహుమతులు ఇస్తూ సాగే కౌన్ బనేగా కరోడ్ పతి తాజా ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:28 AM GMT
ఆ షోలో రోటీన్ కు భిన్నమైన సీన్.. బిగ్ బీని భలే ప్రశ్న అడిగింది
X

ప్రశ్నలు వేయటం.. సరైన సమాధానాలు చెబితే భారీ బహుమతులు ఇస్తూ సాగే కౌన్ బనేగా కరోడ్ పతి తాజా ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ షో ద్వారా యావత్ భారతానికి మరింత దగ్గరయ్యారు బిగ్ బి అమితాబ్. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను పలు ప్రశ్నలు వేస్తుంటారు ఆయన. తాజాగా ఒక ఎపిసోడ్ లో బిగ్ బిని ఆసక్తికర ప్రశ్నను సంధించారు ఒక పోటీదారు. ఆమె అడిగిన ప్రశ్నకు చమత్కారంతో కూడిన సమాధానం ఇచ్చిన అమితాబ్ తీరు ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. ఈ వీడియో వైరల్ గా మారింది.

81 ఏళ్ల వయసులో అటు సినిమాలు.. ఇటు టీవీ షోలతో దూసుకెళుతున్న అమితాబ్ యాంకర్ గా కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం నాన్ స్టాప్ గా నడుస్తోంది. ఈ షో భారీ సక్సెస్ అయ్యాక.. వివిధ భాషల్లో పలువురు ప్రముఖుల చేత ఇదే ప్రోగ్రాంను చేపట్టినా.. హిందీలో అమితాబ్ షోకు వచ్చినంత ఆదరణ మరే షోకు రాలేదు. దీంతో.. మిగిలిన భాషల్లో ఈ ప్రోగ్రాంను ఆపేశారు. కానీ.. హిందీలో మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు 15 సీజన్లను పూర్తి చేసి.. సక్సెస్ ఫుల్ గా పదహారో సీజన్ నడుస్తోంది.

ఈ షోలో హాట్ సీట్లో కూర్చున్న వ్యక్తిని అమితాబ్ పలు ప్రశ్నలు అడుగుతుంటారు.అందుకు భిన్నంగా తాజాగా ఒక ఎపిసోడ్ లో మాత్రం ఒక యువతి.. బిగ్ బిని ఒక ప్రశ్నను సంధించింది. సర్.. మీ దగ్గర చాలా రకాల సూట్స్ ఉంటాయి. అసలు మొత్తం మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? అని అడగ్గా.. దీనికి అమితాబ్ ఒక్కసారిగా నవ్వేశారు. ఇది తన సూట్ కాదని.. సంస్థదిగా పేర్కొన్న ఆయన.. ‘‘నా దగ్గర ఎలాంటి సూట్స్ లేవు. ఈ షో అయ్యాక దీన్ని తిరిగి ఇచ్చేయాలి. నా దగ్గర కేవలం ఫైజమా.. కూర్తా మాత్రమే ఉన్నాయి’’ అంటూ బదులిచ్చారు. ఈ మాటలకు ప్రశ్నించిన యువతి మాత్రమే కాదు.. షోలో పాల్గొన్న ఆడియన్స్ సైతం నవ్వేశారు. అనూహ్యంగా వచ్చిన ప్రశ్నకు అంతే చమత్కారంగా సమాధానం చెప్పిన అమితాబ్ టాలెంట్ ఆసక్తికరంగా మారింది.