Begin typing your search above and press return to search.

కేసీఆర్ ని మీడియా పట్టించుకోవడంలేదా...!?

కేసీఆర్ ని మీడియా పట్టించుకోవడం లేదా అన్న కొత్త చర్చలు తెర లేస్తోంది. కేసీఆర్ అంటే అపర చాణక్యుడు

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:40 PM GMT
కేసీఆర్ ని మీడియా పట్టించుకోవడంలేదా...!?
X

కేసీఆర్ ని మీడియా పట్టించుకోవడం లేదా అన్న కొత్త చర్చలు తెర లేస్తోంది. కేసీఆర్ అంటే అపర చాణక్యుడు. వ్యూహకర్త. ఆయనకు మించిన వారు ఎవరూ లేరు అన్నది మీడియా ఒకనాడు బాగా చేసిన ప్రచారం. కేసీఆర్ ని మాటల మరాఠీగా పేర్కొంది ఇదే మీడియా. కేసీఆర్ వస్తే చాలు ఆయన వెంట పరుగులు తీసినది ఇదే మీడియా. అలాంటి కేసీఆర్ దాదాపు రెండు నెలల తరువాత బయటకు వచ్చారు.

మరి గతంలో కనిపించిన మీడియా హైప్ కానీ ఆ వైభోగం కానీ ఎందుకు లేవు అన్నది అందరిలో కలుగుతున్న ధర్మ సందేహం. నిజానికి చూస్తే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు అంటే అది ఒక సంచలంగానే అంతా చూసేవారు. కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే యూట్యూబర్స్ కి పెద్ద పండుగ.

వారు వ్యూస్ కోసం కేసీఆర్ వైపు చూసేవారు. అలాగే కేసీఆర్ నోటి వెంట వచ్చే ప్రతీ పదాన్ని తమ మీడియాలో చూపించాలని మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియా సోషల్ మీడియా నుంచి అంతా ఆత్రపడిన సందర్భాలు గత పదేళ్లలో కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి కేసీఆర్ మహిమ ఏమై పోయింది.

లేదా మీడియాకు కూడా ఎందుకు ఆయన పట్ల ఆకర్షణ తగ్గింది అన్నది ఇపుడు చర్చగా మారుతోంది. ఇక కేసీఆర్ ఏది చెప్పినా వెంటనే తమ మీడియాలో చూపించేయాలన్న ఉబలాటం ఆరాటం ఎక్కడికి పోయాయి అన్నది కొడా ఇపుడు సందేహంగా ఉంది.

కేసీఆర్ కూడా చాలా మంది పొలిటీషియన్స్ మాదిరిగా కారు. ఆయన రొటీన్ గా మాట్లాడరు. రొడ్డకొట్టుడు స్పీచ్ ఇవ్వరు. ఆయన మీడియా ముందుకు వచ్చారంటే ఆయన వేసే పంచులు వేరే లెవెల్ లో ఉంటాయి. అందులో సెటైర్లు కానీ చమత్కారాలు కానీ కౌంటర్లు కానీ ఒక లెవెల్ అంటే నిజమే మరి. ఆయన ప్రత్యర్ధులను విమర్శించినా కూడా అందులో కూడా అందం ఉంటుంది. పద బంధం ఉంటుంది.

అలాంటిది మాజీ సీఎం కాగానే కేసీఆర్ లో ఆ ఠీవి ఎక్కడా కనిపించకుండా పోయింది. అలాగే ఆయనలో కనిపించే ఒక రకమైన తేజస్సు కూడా ఇపుడు గాయబ్ అయ్యాయా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు కేసీఆర్ ఏడు పదుల వయసులో ఉన్నా ఎపుడూ చలాకీగానే ఉండేవారు హుషార్ కి ఆయన మారు పేరుగా ఉండేవారు.

అయితే ఆయనలో అవన్నీ ఇపుడు టోటల్ గా మిస్ అయ్యాయని అంటున్నారు. కేసీఆర్ రెండు నెలల తరువాత మీడియా ముందుకు వచ్చారు అంటేనే ఏదో పెను సంచలనం అని అంతా అనుకున్నారు కానీ చాలా తేడా వచ్చేసింది అని అంటున్నరు. కేసీఆర్ గతంలో ఒకలా ఇపుడు మరోలా అంటున్నారు. ఆ మునుపటి మనిషి ఇపుడు కానే కారు అని కూడా అంటున్నారు.

కేవలం సీఎం పదవి ఒక్కటి పోయింది. కానీ కేసీఆర్ ని చూస్తే సర్వం పోయినట్లుగానే ఉన్నారు అని అంటున్నారు. ఇదే ఇపుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇక నెటిజన్లు కూడా కేసీఆర్ తాజా వైఖరి మీద తమదైన కామెంట్శ్ తో క్యాప్షన్స్ తో మోతెక్కిస్తున్నారు.

కేసీఆర్ ని ట్రోల్ చేసే సీన్ గతంలో లేదు. కానీ ఇపుడు మాత్రం కారు సారుని ఒక్క లెక్కన ట్రోలింగ్స్ కూడా నెటిజన్లు చేస్తున్నారు. అయితే వీటిని బీఆర్ ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నా కూడా వారిలో అంతర్మధనం మొదలైంది అంటున్నారు. అయితే మా సారొచ్చింది ఇప్పుడే కదా అంటూ ఇక ముందుంది అసలు సిసలైన సినిమా కాస్తా ఆగుండి అని కౌంటర్లు రివర్స్ లో వేస్తున్నారు.

ఏది ఏమైనా కేసీఆర్ లో ఏదో తేడా ఉంది. ఆయన అధికారాంతమున కళ లేని ఫేస్ తో ఉన్నారు అని నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ కి మాత్రం సరైన జవాబు బీఆర్ ఎస్ నుంచి రావడం లేదు. బహుశా వీటికి జవాబు చెప్పే శక్తియుక్తులు ఒక్క కేసీఆర్ కే ఉన్నాయి. కానీ ఆయన ఎందుకో జోష్ గా ఉండడం లేరు. మరి కేసీఆర్ మునుపటిగా గర్జిస్తారా బిగ్ సౌండ్ చేస్తారా అంటే వేచి చూడాల్సిందే మరి.