Begin typing your search above and press return to search.

కీడా కోలా బిజినెస్​.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

అయితే ఈ చిత్రం ఓవర్సీస్​లో 400 వరకు లోకేషన్స్​లో రిలీజ్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్​గానే రిలీజ్​ను సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   3 Nov 2023 5:42 AM GMT
కీడా కోలా బిజినెస్​..  బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
X

చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది. నేడు(నవంబర్ 3) రిలీజైన ఈ చిత్రం బాగానే నవ్విస్తోంది. ప్రీమియర్స్​కు డీసెంట్​ రెస్పాన్స్​ వచ్చింది.

అయితే ఈ చిత్రం ఓవర్సీస్​లో 400 వరకు లోకేషన్స్​లో రిలీజ్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్​గానే రిలీజ్​ను సొంతం చేసుకుంది. ట్రేడ్ పరంగా కూడా మంచి బిజినెస్సే చేసుకుందని తెలిసింది. ఓవరాల్​గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ రూ. 8.5 కోట్ల నుంచి రూ.9 కోట్ల దాకా ఉందని అంచనా.

ఈ లెక్కల పరంగా చూసుకుంటే.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్​గా నిలవాలంటే ఓవరాల్​గా రూ. 9.5 కోట్లకు పైగా షేర్​ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్​కు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి నార్మల్ షోలకు మంచి టాక్ దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం బ్రేక్ ఈవెన్​ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో...

ఇక సినిమా రివ్యూ విషయానికొస్తే.. కామెడీ, ర‌చ‌న, నటుల యాక్టింగ్, సంగీతం ప్లస్​గా నిలిచాయి. అయితే ఊహకు అందేలా కథనం సాగడం కాస్త మైనస్​గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కీడాకోలా... న‌వ్వించే కీడా అని అంటున్నారు.

సినిమాకు పనిచేసినవారు.. సంగీతం - వివేక్‌ సాగర్‌; సినిమాటోగ్రఫీ - ఏజే అరోన్‌; ఎడిటింగ్‌ - ఉపేంద్ర వర్మ; నిర్మాత - కె.వివేక్‌ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌ నండూరి, శ్రీపాద్‌ నందరాజ్‌, ఉపేంద్ర వర్మ ; సమర్పణ - రానా దగ్గుబాటి; రచన సహకారం - ప్రణయ్‌ కొప్పల, రమ్య కాకుమాను, సనాతన్‌ రాజ్‌.