Begin typing your search above and press return to search.

సిస‌లైన ప‌రీక్ష‌కు ప్ర‌చారం తోడ‌వ్వాలి బాస్!

కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేద‌ని ఇప్ప‌టికే చాలా చిన్న చిత్రాలు నిరూపించాయి.

By:  Tupaki Desk   |   5 Nov 2023 7:22 AM GMT
సిస‌లైన ప‌రీక్ష‌కు ప్ర‌చారం తోడ‌వ్వాలి బాస్!
X

కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేద‌ని ఇప్ప‌టికే చాలా చిన్న చిత్రాలు నిరూపించాయి. బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్టు వ‌సూళ్లు తెచ్చిన చిత్రాలెన్నో. సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి ఈ మ‌ధ్య కాలంలో ఈ త‌ర‌హా కంటెంట్ కి ప్రేక్ష‌కుల‌కు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. అందుకే ఓటీటీ కంటెంట్ కి ఆద‌ర‌ణ రెట్టింపు అయింది. తాజాగా ఇటీవ‌లే రిలీజ్ అయిన రెండు చిత్రాలు `కీడా కోలా`..`పొలిమేర‌-2` కూడా పాజిటివ్ బ‌జ్ తోనే రిలీజ్ అయ్యాయి.

అదే బ‌జ్ ని రిలీజ్ త‌ర్వాత కొన‌సాగిస్తున్నాయి. త‌రుణ్ భాస్క‌ర్ సినిమాలంటే మినిమం ఉంటుంద‌ని అంచ‌నాల‌తో కీడా కోలా రాగా...పొలిమేర తొలి భాగం స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో మ‌లిభాగం క్రేజ్ తోనే రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఈ రెండు సినిమాలు పాజిటివ్ మౌత్ టాక్ తో ప్రేక్ష‌కుల్లోకి వెళ్తున్నాయి. ఈ సినిమాలు ఇప్ప‌టివ‌ర‌కూ బాగానే వ‌సూళ్లు సాధించిన‌ట్లు తెలుస్తోంది.

`కీడ కోలా` అమెరికాలో మంచి కలెక్ష‌న్లు సాధిస్తుంది. ఓవ‌ర్సీస్ నుంచే ఈ సినిమా మూడు కోట్లుకు పైగా. .తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు వ‌సూళ్లు సాధించిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా మొద‌టి రోజు 6 కోట్లు గ్రాస్ కీడాకోలా సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అలాగే స‌త్యంరాజేష్ మెయిన్ లీడ్ పోషించి న పొలిమేర‌-2 కొన్ని మంచి సెంటర్లలో బాగానే రాబ‌ట్టింది. మొద‌టి రోజు సినిమాకి మంచి ఆక్యుపెన్సీ క‌నిపించింది.

ఈచిత్రం తొలి రోజు దాదాపు ₹2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింద‌ని స‌మాచారం. అయితే ₹ 3 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు చెబుతున్నారు. ఇందులో కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలకు ఇది మంచి శుభారంభం అని చెప్పాలి. వీకెండ్ కాబ‌ట్టి రెండు సినిమాల‌కు ఆక్యెపెన్సీ పెరుగుతుంది. కేవ‌లం మౌత్ టాక్ తోనే ఈ సినిమాలు జ‌నాల్లోకి వెళ్లాయి. వీటికి బూస్టింగ్ గా ప్ర‌చారం అవ‌స‌రం. ఈ రెండు సినిమాల‌కు మేక‌ర్స్ వీలైనంత వ‌ర‌కూ గ‌ట్టి ప్ర‌చారం తేగ‌లిగితే మ‌రింత రీచ్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. సోమ‌వారం నుంచి అస‌లై ప‌రీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.