రివ్యూల ఎఫెక్ట్... అక్కడ లాభం!
మొత్తానికి యూఎస్ లో మంచి వసూళ్లు నమోదు అవ్వడానికి పాజిటివ్ రివ్యూలు హెల్ప్ అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 6 Nov 2023 5:44 AM GMTతరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'కీడ కోలా'. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే వసూళ్ల విషయంలో దూకుడు మాత్రం కనిపించడం లేదు. కీడాకోలా సినిమా తో పాటు వచ్చిన పొలిమేర 2 సినిమాకు మాత్రం మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల సమాచారం.
కీడాకోలా సినిమా కు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వకున్నా కూడా యూఎస్ లో మాత్రం ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యాయి. అక్కడ నుంచి అటు ఇటుగా మరో రెండు లక్షల డాలర్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
మొత్తానికి యూఎస్ లో మంచి వసూళ్లు నమోదు అవ్వడానికి పాజిటివ్ రివ్యూలు హెల్ప్ అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రివ్యూలతో పాటు తరుణ్ భాస్కర్ కి మొదటి సినిమా నుంచి కూడా యూఎస్ లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందుకే ఈ సినిమాకు అక్కడ మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.
ఒక చిన్న సినిమాకు తక్కువ సమయంలో హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయ్యాయి అంటే మామూలు విషయం కాదు అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ స్థాయిలో వసూళ్లు నమోదు చేసి ఉంటే కచ్చితంగా కీడా కోలా కి భారీ లాభాలు దక్కి ఉండేవి అనేది టాక్.