'మై టూర్ MMK'కి మెగాస్టార్ ప్రమోషన్ హెల్ప్ అయ్యేనా?
ఒకప్పుడు మైకేల్ జాక్సన్ లైవ్ షోల కోసం ఫ్యాన్స్ ప్రాణాలు ఇచ్చే వారు.
By: Tupaki Desk | 24 Feb 2025 4:45 AM GMTవిదేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్‌లకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా యూఎస్‌ఏలో పాప్ సింగర్స్ మ్యూజిక్ కన్సర్ట్‌లకు, లైవ్ షోలకు ఏ స్థాయిలో స్పందన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మైకేల్ జాక్సన్ లైవ్ షోల కోసం ఫ్యాన్స్ ప్రాణాలు ఇచ్చే వారు. ఇప్పటికీ యూఎస్‌తో పాటు పలు దేశాల్లో లైవ్ షోలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడితో పోల్చితే ఇండియాలో కాస్త ఆదరణ తక్కువ అని చెప్పాలి. ముంబై, చెన్నై, బెంగళూరులో ఒక మోస్తరు ఆదరణ లభించిన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి లైవ్ షో లకు, మ్యూజిక్ కన్సర్ట్‌లకు పెద్దగా స్పందన రావడం లేదు. ఇప్పటికే కొన్ని సంస్థలు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్‌లు చేసి ఆశించిన స్పందన దక్కించుకోలేక పోయారు.
హైదరాబాద్‌లో మ్యూజిక్ కన్సర్ట్‌లకు పెద్దగా స్పందన ఉండదు అనే విషయం తెలిసి కూడా ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి లైవ్ షోకి సిద్దం అయ్యారు. ప్రముఖ సింగర్స్‌తో ఈ షో జరగబోతుంది. ఇప్పటికే బుకింగ్ ప్రారంభం అయింది. హైదరాబాద్ ప్రేక్షకులు సినిమాలను థియేటర్‌లలో చూసేందుకు క్యూ కడతారు. కానీ ఇలాంటి కన్సర్ట్ కి ఇంకా అలవాటు కాలేదు. అందుకే కీరవాణి కన్సర్ట్‌కి ఎలాంటి స్పందన వస్తుంది అనేది కాస్త అనుమానంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఈ మ్యూజిక్ కన్సర్ట్‌కి తన మద్దతు తెలిపారు. ఒక వీడియోను షేర్ చేసి కీరవాణి మ్యూజిక్ కన్సర్ట్‌ను ప్రమోట్ చేశారు. దాంతో మ్యూజిక్ కన్సర్ట్ గురించి జనాల్లో చర్చ మొదలైంది.
తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన మ్యూజిక్ కన్సర్ట్‌లకు గొప్ప స్పందన రాలేదు. జనాలు ఒక మోస్తరుగా వస్తారు, అయితే యూఎస్‌లో వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రాదని చెప్పాలి. ఇంతకు ముందు ఏ మ్యూజిక్ కన్సర్ట్‌కు చేయనంత ప్రచారంను చేస్తున్నారు. మార్చి 22న మై టూర్ ఎంఎంకే పేరుతో కీరవాణి ఈ కన్సర్ట్‌ను నిర్వహించబోతున్నారు. అందుకోసం ప్రమోషన్‌ను పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన మద్దతు తెలుపగా త్వరలోనే రాజమౌళి, మహేష్ బాబు సైతం బైట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ సైతం ఈ మ్యూజిక్ కన్సర్ట్ కి సంబంధించి ప్రమోషన్‌లో హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంత మంది మద్దతు తెలిపితే కచ్చితంగా మై టూర్ ఎంఎంకే కి మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మ్యూజిక్ కన్సర్ట్‌లకు పెద్ద మొత్తంలో టికెట్ రేట్లను పెట్టి కొనుగోలు చేసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించరు అనే అభిప్రాయం ఉంది. కానీ ఈసారి పలువురు ప్రముఖ స్టార్స్ ప్రమోషన్ చేస్తే తప్పకుండా పెద్ద మొత్తంలో టికెట్స్ తెగే అవకాశాలు ఉన్నాయి. కీరవాణి మ్యూజికల్ కన్సర్ట్ సక్సెస్ అయితే కచ్చితంగా భవిష్యత్తులో హైదరాబాద్‌లో మరిన్ని కన్సర్ట్ లు, లైవ్ షో లు జరిగే అవకాశాలు ఉన్నాయి.