Begin typing your search above and press return to search.

కీరవాణికి నిద్రలేకుండా చేసిన చంద్రముఖి

తెలుగు చిత్రసీమలో ఎన్నో మరపురాని సూపర్ హిట్ సాంగ్స్​ను అందించి సినీ ప్రియులు, శ్రోతల మదిలో చెరగిపోని ముద్ర వేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి.

By:  Tupaki Desk   |   24 July 2023 5:35 AM GMT
కీరవాణికి నిద్రలేకుండా చేసిన చంద్రముఖి
X

తెలుగు చిత్రసీమలో ఎన్నో మరపురాని సూపర్ హిట్ సాంగ్స్​ను అందించి సినీ ప్రియులు, శ్రోతల మదిలో చెరగిపోని ముద్ర వేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. మరకత మణిగా తమిళంలో, ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌గా హిందీలోనూ ఎంతో మంది శ్రోతలను ఉర్రూతలూగించారు. రీసెంట్​గా 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకుని ఆస్కీరవాణిగా.. మరింత ఉన్నత స్థానాన్ని అందుకన్నారు.

అయితే తాజాగా ఈ మధుర రాగాల మాంత్రికుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానుల్లో జోష్​ను నింపారు. తాను రెండు నెలల పాటు నిద్రలేకుండా ఓ సినిమా కోసం బాగా కష్టపడినట్లు చెప్పుకొచ్చాు. ఆ చిత్రానికి ఎంతో అద్భుతంగా సంగీతం అందించినట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి 'చంద్రముఖి 2'. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్డేట్​ను తన అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్ ద్వారా చెప్పారు. సినీ ప్రియుల్లో మరింత ఆసక్తి రేకెత్తించారు.

చంద్రముఖి 2 తొలి​ కాపీని చూసి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. "ఈ చిత్రంలోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతాయి. ఆ అద్భుతమైన సీన్స్​ కోసం నేను 2 నెలల పాడు నిద్రపోకుండా సంగీతం అందించాను" అని కీరవాణి చెప్పారు. అలాగే సంగీత దర్శకులు గురుకిరణ్‌, విద్యాసాగర్‌ ల ఆశీస్సులను కోరారు.

ప్రస్తుతం కీరవాణి చేసిన పోస్ట్‌ చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. 'చంద్రముఖి 2 కోసం, ఈ చిత్రానికి మీరు అందించిన బీజీఎమ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాము. లక. లక, లక' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఇండియన్​ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన చంద్రముఖికి సీక్వెల్​గా ఈ రెండో భాగం రూపొందుతోంది. 2005లో రిలీజైన ఈ చిత్రం మంచి హిట్​ ను అందుకుంది. ఈ రెండు చిత్రాలకు పి. వాసు దర్శకత్వం వహించారు. రెండో భాగంలో రాఘవ లారెన్స్‌ నటించారు. రాజ నర్తకిగా బాలీవుడ్‌ కాంట్రవర్సీ యాక్టర్​ కంగనా రనౌత్‌ నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది.