కీరవాణి.. ఆ సినిమా కోసం 10 పాటలు
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సంగీతపరంగా పర్ఫెక్ట్ ట్యూన్స్ ఇచ్చే అతి కొద్ది మంది సంగీత దర్శకులలో కీరవాణి మాత్రమే నెంబర్ వన్
By: Tupaki Desk | 17 Aug 2023 9:17 AM GMTప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సంగీతపరంగా పర్ఫెక్ట్ ట్యూన్స్ ఇచ్చే అతి కొద్ది మంది సంగీత దర్శకులలో కీరవాణి మాత్రమే నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. తెలుగు సంగీత సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని బాహుబలి, RRR లాంటి సినిమాలతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ను కీరవాణి మంచి క్రేజ్ అందుకున్నారు.
ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు జాతి గర్వపడేలా చేశారు. ఎలాంటి పాటనైనా సరే తనదైన శైలిలో కంపోజ్ చేసి ఆకట్టుకునే కీరవాణి మళ్లీ చాలా బిజీగా మారిపోయారు. గత కొంతకాలంగా రాజమౌళి సినిమాలకు తప్పితే ఆయన ఇతర సినిమాలతో పెద్దగా సక్సెస్ లో అయితే అందుకోవడం లేదు. ఇక ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం కీరవాణి చంద్రముఖి 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 2005 లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో కూడా మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ఇప్పటికే ఒక పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించబోతోంది.
అయితే ఈ సినిమాలో మొత్తంగా 10 పాటలు ఉంటాయట. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకైనా సరే మూడు లేదా నాలుగు పాటలు మాత్రమే సినిమాలో కనిపిస్తున్నాయి. దర్శకులు కూడా ఎక్కువగా సాంగ్స్ సెట్ చేయడంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ఇక కీరవాణి టాలెంట్ కు తగ్గట్టుగా దర్శకుడు పీ వాసు చంద్రముఖి సినిమాలో అద్భుతమైన 10 పాటలను సెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కీరవాణి ఎలాంటి సాంగ్ ఇచ్చిన కూడా అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే విధంగా బాణీలు సమకూరుస్తూ ఉంటారు. ఇక చంద్రముఖి 2 సినిమాలో కూడా త్రిల్లింగ్ అనిపించేలా తన ట్యూన్స్ తో ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే ఆయన భయపెట్టబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ తెలియజేస్తోంది. ఇక ఆస్కార్ అందుకున్న తర్వాత కీరవాణి నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి కలుగుతోంది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.