కోలీవుడ్ వేదికపై కీరవాణికి సన్మానం!
By: Tupaki Desk | 20 Aug 2023 7:05 AM GMTఆస్కార్ వేదికపై `నాటు నాటు` పాట భారతీయ జెండానికి రెప రెపలాడించిన సంగతి తెలిసిందే. భారతీయ చిత్రానికి తొలిసారి ఆస్కార్ అందించి దేశం మీసం తిప్పేలా చేసింది. అందులోనూ తెలుగు సినిమా ఈ ఖ్యాతిని సాధించడం విశేషం. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలోని ఈ పాటకి ఎం. ఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీరవాణి సహా అతని టీమ్ కి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున ఘనమైన సన్మానం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటకి ఆస్కార్ వరించినా..టాలీవుడ్ మినహా మిగతా భాషల సెలబ్రిటీల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ఆ పాట కోసం పనిచేసిన వారిని విష్ చేసిన సెలబ్రిటీలు చాలా తక్కువ మందే. ఆస్కార్ సాధించింద నందుకు అన్ని పరిశ్రమలు ముందుకొచ్చి ఘనమైన సత్కారం అందించాలి. కానీ ఆ ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో `జెంటిల్మెన్` సీక్వెల్ ప్రారంభోత్సవ వేడుకపై కీరవాణిని సన్మానించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తరుపును చెన్నైలో సత్కరించారు. ఇది కోలీవుడ్ వేదికపై జరగడం విశేషమని చెప్పాలి.
సాధారణంగా తెలుగు నుటలకు కోలీవుడ్ వేదికలపై సన్మాలు చాలా అరుదు. పాన్ ఇండియా వైడ్ సినిమా అంతా ఒక ఎత్తైతే....కోలీవుడ్ మరో ఎత్తు. అక్కడ స్థానికతకి ఇచ్చినంత ప్రాధాన్యత బయట పరిశ్రమల నుంచి వచ్చిన వారికి ఇవ్వరు. కానీ నిన్నటి రోజున అలాంటి వాతావరణం కనిపించలేదు. తమిళనాడు రాష్ట్ర సమాచార శాఖ..ప్రసార శాఖ మంత్రి ఎల్. మురుగన్ తో పాటు.. జపాన్ కాన్సులేట్ జనరల్ టాగా మసయకి.. దక్షిణా భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు రవి కొట్టారాతో పాటు..పులువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.
వాళ్లందరి సమక్షంలో సన్మానం జరగడం విశేషం. ఆస్కార్ అందుకున్న తర్వాత టాలీవుడ్ మినహా మరో పరిశ్రమలో జరిగిన సన్మానం ఇదే. దేశంలో శాండిల్ వుడ్..మాలీవుడ్...బాలీవుడ్...భోజ్ పురి ఇలా కొన్ని చిత్ర పరిశ్రమలున్నాయి. ఆవేదికలు పంచుకోనప్పటికీ కొలీవుడ్ లో చెన్నై వేదికగా సన్మానం జరగడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీరవాణి తమిళ్ లోనూ చాలా సినిమాలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే.