Begin typing your search above and press return to search.

స‌ర్ధుకుపోతాడు.. అప్పుడే కొంగున క‌ట్టేసుకున్న కీర్తి

తాజా ఇంట‌ర్వ్యూలో కీర్తి సురేష్ మా ఆయ‌న బంగారం, కొన్నిటికి స‌ర్ధుకుపోతుంటాడు! అని బ‌య‌ట‌కు తెలియ‌ని సంగ‌తిని చెప్పింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 8:30 PM GMT
స‌ర్ధుకుపోతాడు.. అప్పుడే కొంగున క‌ట్టేసుకున్న కీర్తి
X

అవును.. మా ఆయ‌న బంగారం.. స‌ర్ధుకుపోతాడు! అని అంటోంది కీర్తి సురేష్‌. ఈ భామ గ‌త ఏడాది చివ‌రిలో పెద్ద‌ల అంగీకారంతో త‌న చిర‌కాల స్నేహితుడు, ప్రియుడు అయిన ఆంటోని త‌టిల్‌ని పెళ్లాడేసింది. వివాహం నుంచి ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌లే మ‌ల‌యాళీ స్టైల్ ఆఫ‌ర్ట్ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వెబ్‌లో హీటెక్కించాయి.

తాజా ఇంట‌ర్వ్యూలో కీర్తి సురేష్ మా ఆయ‌న బంగారం, కొన్నిటికి స‌ర్ధుకుపోతుంటాడు! అని బ‌య‌ట‌కు తెలియ‌ని సంగ‌తిని చెప్పింది. పెళ్లి త‌ర్వాత కూడా జీవితం ఏమీ మార‌లేద‌ని, పెళ్లికి ముందు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నందున ఇప్పుడు పెద్ద‌గా మారేది ఏమీ లేద‌ని కూడా కీర్తి చెప్పింది. నేను సోష‌ల్ మీడియాల్లో ఎక్కువ‌గా ఉంటాను. కానీ మా ఆయన దానిని భ‌రిస్తాడు. స‌ర్ధుకుపోతుంటాడు.. అని వెల్ల‌డించింది. న‌న్ను బాగా అర్థం చేసుకున్న వ్య‌క్తి గనుక ఎలాంటి ఇబ్బంది లేద‌ని కీర్తి వ్యాఖ్యానించింది.

కీర్తి న‌టించిన ఇటీవ‌లి చిత్రం బేబి జాన్ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేదు. ఈ చిత్రంలో వ‌రుణ్ ధావ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ప్ర‌మోష‌న్స్ కోసం కీర్తి చాలా శ్ర‌మించింది. ఇదిలా ఉంటే, రివాల్వ‌ర్ రీటా, క‌న్నె వీడి అనే రెండు చిత్రాల్లో ప్ర‌స్తుతం కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ ప్రాజెక్టుల గురించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.