గోవాలో ఆ రేంజులో చిల్ చేసిన పెళ్లికూతురు కీర్తి
మహానటి కీర్తి తెల్లటి బ్రాలెట్, మ్యాచింగ్ ప్యాంటులో క్లాసీగా కనిపించగా, రంగురంగుల పొడవైన బ్లేజర్ అదనంగా ఆకట్టుకుంది.ఆంటోనీ ప్రింటెడ్ షర్ట్- తెల్లటి ప్యాంటు ధరించాడు.
By: Tupaki Desk | 3 Feb 2025 10:39 AM GMTఅందాల కథానాయిక కీర్తి సురేష్ తన స్నేహితుడు ఆంటోని తటిల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. హిందూ క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్స్ లో ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. కీర్తి- ఆంటోని దశాబ్ధ కాలంగా ప్రేమలో ఉన్నారు. సీక్రట్ ప్రేమాయణానికి ముగింపు పలుకుతూ.., చివరికి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లి ప్రేమ పెళ్లి ఇతర జంటలకు గోల్స్ ని సెట్ చేసింది. డిసెంబర్ 12న ఈ అందమైన కపుల్ గోవాలో పెళ్లాడారు. పెళ్లికి సంబంధించిన గ్లింప్స్ ని లక్షలాదిగా ఉన్న తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి కీర్తి షేర్ చేసింది.
తాజాగా రిలీజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో కీర్తి- ఆంటోని జంట గోవా పార్టీలో చిల్ చేస్తూ కనిపించారు. మహానటి కీర్తి తెల్లటి బ్రాలెట్, మ్యాచింగ్ ప్యాంటులో క్లాసీగా కనిపించగా, రంగురంగుల పొడవైన బ్లేజర్ అదనంగా ఆకట్టుకుంది.ఆంటోనీ ప్రింటెడ్ షర్ట్- తెల్లటి ప్యాంటు ధరించాడు. ఆ ఇద్దరూ ఒకరికొకరు చేతిలో చెయ్యేసి ఆనందకర జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ కీర్తి ''గోవాలో ఉన్నప్పుడు, జస్ట్ గో గోన్ పి.ఎస్. ప్రతి డీటెయిల్ ఒక కథ చెబుతుంది..'' అని క్యాప్షన్ ఇచ్చింది.
ఆసక్తికరంగా ఈ పెళ్లిలో కొత్త జంట పెంపుడు కుక్క నైక్ సందడి చేస్తున్న ఫోటోలు కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పెట్ డాగ్ ఈ అందమైన జంటతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి అరుదైన దృశ్యాలతో ఫోటోషూట్ హృదయాలను గెలుచుకుంది.