Begin typing your search above and press return to search.

డ్రీమ్ ఐకాన్‌తో కీర్తి సురేష్ - ఆంటోని జంట‌

మ‌హాన‌టి కీర్తి సురేష్ త‌న స్నేహితుడు ఆంటోని త‌టిల్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. హిందూ, క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయాల్లో రెండుసార్లు వివాహం జ‌రిగింది

By:  Tupaki Desk   |   19 Dec 2024 4:07 AM GMT
డ్రీమ్ ఐకాన్‌తో కీర్తి సురేష్ - ఆంటోని జంట‌
X

మ‌హాన‌టి కీర్తి సురేష్ త‌న స్నేహితుడు ఆంటోని త‌టిల్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. హిందూ, క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయాల్లో రెండుసార్లు వివాహం జ‌రిగింది. ఈ పెళ్లి గోవాలో సింపుల్ గా వారి కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల మ‌ధ్య జ‌రిగింది. వేడుక‌కు కొద్దిమంది సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఈ జంట తొలుత‌ సాంప్రదాయ అయ్యంగార్ విధానంలోని వివాహ‌ వేడుకల నుంచి ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత క్రిస్టియ‌న్ స్టైల్ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోల‌ను కూడా షేర్ చేసారు. ఇక అయ్యంగార్ విధానంలోని పెళ్లికి హాజ‌రైన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. విజ‌య్ సాంప్ర‌దాయ పంచెక‌ట్టు తెల్ల చొక్కాలో సింపుల్ గా క‌నిపించాడు.

కీర్తి సురేష్ ఈ ఫోటోల‌ను షేర్ చేస్తూ...``మా డ్రీమ్ ఐకాన్ మా డ్రీమ్ వెడ్డింగ్‌లో మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు! విజ‌య్ స‌ర్ ప్రేమ‌తో.. మీ నంబీ - నాన్‌బన్.. `` అని ట్యాగ్ లైన్ ని జోడించింది. పెళ్లిలో కీర్తి పసుపు ఆకుపచ్చ మడిసర్ (ఒక రకమైన డ్రెప్)- ఆండాల్ కొండై లుక్ లో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. త‌న భ‌ర్త‌తో న‌వ్వులు చిందిస్తూ విజ‌య్ తో క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చింది. కీర్తి సురేష్ ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న బైరవ, సర్కార్ (2018) అనే రెండు చిత్రాల్లో న‌టించింది. కీర్తి పెళ్లిలో నేచుర‌ల్ స్టార్ నాని- అంజ‌నా య‌ల‌ప‌ర్తి, త్రిష‌, అట్లీ- ప్రియ జంట స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు క‌నిపించారు.

వ‌రుడు ఆంటోనీ స్వ‌స్థ‌లం కొచ్చి. దుబాయ్ కేంద్రంగా రిసార్ట్స్ చైన్ వ్యాపారాల‌ను నిర్వ‌హిస్తున్నాడు. కీర్తి- ఆంటోని జంట 15 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కెరీర్ మ్యాటర్ కి వ‌స్తే... కీర్తి సురేష్ తన త‌దుప‌రి చిత్రం బేబీ జాన్ విడుదల కోసం వేచి చూస్తోంది. వరుణ్ ధావన్ - కీర్తి జంట‌గా నటించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. కీర్తికి తొలి బాలీవుడ్ చిత్ర‌మిది.