Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్.. చీరలో కూడా హై గ్లామర్ డోస్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది ‘బేబీ జాన్’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 5:07 AM GMT
కీర్తి సురేష్.. చీరలో కూడా హై గ్లామర్ డోస్
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది ‘బేబీ జాన్’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. కానీ ఈ సినిమాలో కీర్తి సురేష్ కాస్తా గ్లామర్ డోస్ పెంచి నటించింది. సాంగ్స్ లో కూడా అల్ట్రా మోడ్రన్ లుక్స్ లో మెస్మరైజ్ చేసింది. దీంతో బాలీవుడ్ మీడియా కీర్తి సురేష్ ని బాగా వైరల్ చేసింది.


సౌత్ లో స్టార్ హీరోలతో జతకట్టిన కీర్తి సురేష్ ఎప్పుడు కూడా గ్లామర్ షో పరంగా లిమిటేషన్స్ లోనే ఉంది. అయితే బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే లుక్స్ మార్చాల్సిందే అని ఫిక్స్ అయినట్లు ఉంది. దీంతో మునుపెన్నడూ లేని సరికొత్త అందంతో కీర్తి సురేష్ ప్రస్తుతం సందడి చేస్తోంది. పెళ్లి తర్వాత ఎక్కువగా ఈ బ్యూటీ చీరలలోనే కనిపిస్తున్న కూడా వాటికి మోడ్రన్ టచ్ చేస్తోంది.


స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ బ్యూటీ హిందీలో ‘అక్క’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. రాధికా ఆప్టే తో పాటు ఈ సిరీస్ లో కీర్తి సురేష్ నటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ లో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో కీర్తి సురేష్ పాల్గొంది. వైట్ కలర్ శారీలో, కర్లీ హెయిర్ తో ఉన్న మోడ్రన్ మహారాణిలా ఈ కీర్తి సురేష్ ఈ ఈవెంట్ లో కనిపించింది.


‘అక్క’ టీజర్ లో ఆమె క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. కాస్తా గ్రే షేడ్స్ లో సీరియస్ మూడ్ లో కీర్తి సురేష్ టీజర్ లో కనిపించింది. ఫీమేల్ సెంట్రిక్ గా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. ఇక ‘అక్క’ టీజర్ రిలీజ్ సందర్భంగా కీర్తి సురేష్ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ ఫోటోలలో కీర్తి సురేష్ చాలా అందంగా ఉందనే మాట వినిపిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె స్టైల్, లుక్స్, బాడీ లాంగ్వేజ్ లో పూర్తిగా మార్పు వచ్చిందని ఈ లుక్స్ చూసిన నెటిజన్లు అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా క్వీన్ లా రాజసం ఉట్టిపడే విధంగా కీర్తి లుక్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే లుక్స్ మెయింటేన్ చేస్తే కచ్చితంగా బాలీవుడ్ లో ఆమె స్పీడ్ పెరగడం ఖాయం అని అందరు అనుకుంటున్నారు.