Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ బాలీవుడ్ కి అందుకే వెళ్లిందా?

అయినా అప్ప‌టి అమ్మ‌డి ఇమేజ్ పై కొంత నెగిటివిటీ ప‌డింది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 8:30 AM GMT
కీర్తి సురేష్ బాలీవుడ్ కి అందుకే వెళ్లిందా?
X

కీర్తి సురేష్ కి తెలుగులో హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గిన మాట వాస్త‌వం. 'మ‌హాన‌టి' త‌ర్వాత హీరోయిన్ గా అవ‌కాశాలే లేవు అనుకుంటోన్న స‌మ‌యంలో మెల్ల‌గా పుంజుకుని అవ‌కాశాలు అందుకుంది. కానీ వేగం మాత్రం పెంచ‌లేక పోయింది. చెప్పుకోవ‌డానికి స్టార్ హీరో సినిమాలో భాగ‌మైనా ఆమెకి పెద్ద‌గా క్రెడిబిలిటీ ద‌క్కింది లేదు. దీంతో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సైతం సై అన్న‌ట్లే క‌నిపించింది. 'గుంటూరు కారం'లో క‌ళావ‌తిగా మెప్పించి కుర్రాళ్ల‌కు ద‌గ్గ‌రైంది. అయినా అప్ప‌టి అమ్మ‌డి ఇమేజ్ పై కొంత నెగిటివిటీ ప‌డింది. దీంతో హీరోయిన్ అవ‌కాశాలు పూర్తిగా సన్న‌గిల్లాయి.

ఈ నేప‌థ్యంలో చిరంజీవికి సోద‌రి పాత్ర సైతం చేసింది. కీర్తి కూడా టాలీవుడ్ జ‌ర్నీ విష‌యంలో ఓ అంచ‌నాకి వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. అనూహ్యంగా ఒక్క‌సారిగా బాలీవుడ్ కి ట‌ర్న్ తీసుకుంది. అప్ప‌టికే స‌మంత‌, త‌మ‌న్నా లాంటి వారు అక్క‌డ ఉండ‌టంతో ఏమాత్రం మ‌రో ఆలోచ‌న లేకుండా సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లు కూడా క‌మిట్ అయింది. బాలీవుడ్ భామ‌ల‌కు పోటీగా త‌గ్గేదేం లేదంటూ ముందుకెళ్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో చిన్న‌నాటి స్నేహితుడు ఆంటోనీ త‌ట్టిల్ ని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.

కీర్తి పెళ్లితో ఇలా స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. మ‌రి ఈ పెళ్లి..బాలీవుడ్ జ‌ర్నీ వెనుక అస‌లు క‌థ ఏంటి? అంటే తెలివిగా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ఐడియా ఒక‌టుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో `బేబిజాన్` లో న‌టిస్తోంది. ఈ సినిమాకు అమ్మ‌డు 5 కోట్ల‌కు పైగానే పారితోషికం తీసుకుందిట‌. ఇంకా కమిట్ అయిన ప్రాజెక్ట్ ల‌కు అందుకున్న పారితోషికం ఒక్కో ప్రాజెక్ట్ కు 5-6 కోట్ల‌కు పైగానే అందుకుంటుంద‌ని స‌మాచారం.

మ‌రిఈ రేంజ్ లో పారితోషికం తెలుగు సినిమాల ద్వారా అందుకోలేదా? అంటే లేద‌నే తెలుస్తోంది. ఇక్క‌డ ఒక్కో సినిమాకు కేవ‌లం రెండు కోట్లు మాత్ర‌మే తీసుకుందిట‌. అయితే ఇక్కడ‌ మ‌రో కార‌ణం కూడా వినిపిస్తుంది. తెలుగు లో ఇంత పారితోషికం ఇవ్వండ‌ని కీర్తి ఇంత వర‌కూ ఎవ‌ర్నీ డిమాండ్ చేయ‌లేదుట‌. నిర్మాత‌లు రెండు కోట్లు లెక్క క‌ట్టి ఇస్తే తీసుకోవ‌డం త‌ప్ప‌! ప్ర‌త్యేక‌మైన డిమాండ్ చేయ‌లేదుట‌. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా డిమాండ్ లాంటి ప్ర‌పోజ‌ల్స్ లేకుండా 5-6 కోట్లు అందుకుంటుందిట‌. ఈ నేప‌థ్యంలో కీర్తి బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు వినిపిస్తుంది. పెళ్లైన భామ‌ల‌కు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉండ‌టంతో? కొత్త పెళ్లి కూతురు అవ్వ‌డం కూడా క‌లిసొచ్చే అంశమే.