Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ కూడా రష్మిక రూట్లోనే..

‘మహానటి’ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని కీర్తి సురేష్ అందుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Dec 2024 12:30 AM GMT
కీర్తి సురేష్ కూడా రష్మిక రూట్లోనే..
X

‘మహానటి’ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని కీర్తి సురేష్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగు వారికి ఇష్టమైన కథానాయిక అయిపొయింది. అయితే 2013లోనే కీర్తి హీరోయిన్ గా మాతృభాష మలయాళంలో అరంగేట్రం చేసింది. 2015లో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2016లో ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తరువాత ‘నేను లోకల్’ తో మరో సక్సెస్ ని అందుకుంది.

మూడో సినిమానే ఏకంగా పవన్ కళ్యాణ్ తో చేసే ఛాన్స్ ని ‘అజ్ఞాతవాసి’ మూవీతో కీర్తి సురేష్ అందుకుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 2018లో వచ్చిన ‘మహానటి’ మూవీ ఆమెకి ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ మారిపోయింది. తెలుగు, తమిళ్, మళయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది. అయితే కీర్తి సురేష్ నటిగా తన పెర్ఫార్మెన్స్ తో అందరికి చేరువ అయిన కమర్షియల్ హీరోయిన్ అనే ముద్ర వేసుకోలేకపోయింది.

ఎక్కువగా ఆమె పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలోనే కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాతో కీర్తి సురేష్ రూట్ మార్చింది. అప్పటి నుంచి గ్లామర్ రోల్స్ చేయడం మొదలు పెట్టింది. ఇక కీర్తి సురేష్ కంటే ఆలస్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన ఓ వైపు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూనే గ్లామర్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమర్షియల్ మూవీస్ లలో కూడా పెర్ఫార్మెన్స్ పరంగా అందరిని మెప్పించసాగింది.

దీంతో చాలా వేగంగా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అయిపొయింది. ‘గీతాగోవిందం’, ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరూ’ లాంటి సినిమాలతో టాప్ చైర్ లోకి రష్మిక వచ్చేసింది. ‘పుష్ప’ మూవీ పూర్తిగా ఆమె ఫేట్ ని మార్చేసింది. నేషనల్ వైడ్ గా ఆమెకి పుష్ప క్రేజ్ తీసుకొచ్చింది. తరువాత ‘యానిమల్’ సినిమాలో ఓ వైపు పెర్ఫార్మెన్స్ తో అందరిని మెప్పిస్తూనే మరో వైపు బోల్డ్ ఇంటిమెంట్ సన్నివేశాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పెర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకుంది.

‘పుష్ప 2’ మూవీతో ఇప్పుడు మరో సూపర్ సక్సెస్ ని అందుకోబోతోంది. నెక్స్ట్ హిందీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ తో వస్తోన్న ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విక్కీ కౌశల్ ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించారు. దీంతో పాటు మరో హిందీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అలాగే తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్స్ లలో ఒకరుగా రష్మిక ఉంది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా రష్మిక బాటలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘బేబీ జాన్’ సినిమాతో కీర్తి హిందీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సాంగ్ లో ఆమె గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేసింది. ఈ చిత్రంతో బాలీవుడ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్స్ రేసులోకి కీర్తి సురేష్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి అమ్మడు భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.