Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : క్యూట్‌ కీర్తి భలే ఉన్నావే!

తాజాగా కీర్తి సురేష్ మరోసారి క్యూట్‌ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది. సింపుల్‌ డ్రెస్‌లో లూజ్‌ హెయిర్‌తో క్యూట్‌ స్మైల్‌తో పిచ్చెక్కించే విధంగా కీర్తి సురేష్ లుక్ ఉంది.

By:  Tupaki Desk   |   20 March 2025 8:30 AM IST
పిక్‌టాక్ : క్యూట్‌ కీర్తి భలే ఉన్నావే!
X

కేరళలో పుట్టినప్పటికీ తమిళనాడులో ఎక్కువ సినిమాలు చేయడంతో కీర్తి సురేష్‌కి తమిళ్‌ ముద్దుగుమ్మ అనే పేరు పడింది. ఇండస్ట్రీలో తన వారు ఉండటంతో ఆఫర్లు ఈజీగానే వచ్చినా సక్సెస్‌లు మాత్రం అంత ఈజీగా రాలేదు. కెరీర్‌ ఆరంభం నుంచి నటిగా తనను తాను నిరూపించుకుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం కావడంతో పాటు నటిగా ప్రతిభ కనబర్చడంతో ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. సాధారణంగా కమర్షియల్‌ హీరోయిన్స్‌ అంటే స్కిన్‌ షో చేసి, రొమాంటిక్ సీన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ కీర్తి సురేష్ మాత్రం స్కిన్‌ షో కి కెరీర్‌ ఆరంభం నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పటికీ చాలా పద్దతిగా స్కిన్‌ షో చేయకుండానే సినిమాలు చేస్తూ వస్తుంది.

స్కిన్‌ షో చేయకుండా హీరోయిన్‌గా ఇన్నాళ్లు కొనసాగడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కీర్తి సురేష్ మాత్రం మహానటి తో పాటు పలు సినిమాల్లో తన నటనతో మెప్పించి స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ్‌ ఇతర భాషల్లోనూ సినిమాలు చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈమధ్య కాలంలో హిందీ సినిమాల్లోనూ నటించడం ద్వారా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బేబీ జాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మరిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మొదటి సినిమా నిరాశ పరచినా వెంటనే ఒక హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం స్కిన్‌ షో చేయకుండానే ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్ మరోసారి క్యూట్‌ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది. సింపుల్‌ డ్రెస్‌లో లూజ్‌ హెయిర్‌తో క్యూట్‌ స్మైల్‌తో పిచ్చెక్కించే విధంగా కీర్తి సురేష్ లుక్ ఉంది. ఈ స్థాయిలో అందంగా ఉన్న కీర్తి సురేష్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడం బాధగా ఉంది అంటూ కొందరు సరదాగా సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. మరో పదేళ్ల పాటు అన్ని భాషల్లోనూ బిజీ బిజీగా సినిమాలు చేసే విధంగా ఆఫర్లు దక్కించుకునేది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో కీర్తి సురేష్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో వినిపించింది. అందులోని ఒక రోబోకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్‌ ఇచ్చింది. అంతకు ముందు తెలుగులో భోళా శంకర్‌ సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలో నటించింది. టాలీవుడ్‌లో నానికి జోడీగా దసరా సినిమాలో హీరోయిన్‌గా నటించడం జరిగింది. తెలుగులో మరిన్ని సినిమాలను ఈమె చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఈమె దృష్టి మొత్తం హిందీ సినిమాలపై ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంది. రెండు తమిళ్‌ సినిమాలను సైతం ఈమె నటిస్తోంది. అతి త్వరలోనే ఈమె నటిస్తున్న అక్క వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది.