Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోయిన్ సర్ నేమ్ మార్చలేదేంటి..?

పెళ్లైనా తండ్రి మీద ప్రేమతో అలా పేరు చివర తండ్రి పేరు ఉంచుకున్న వారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   31 March 2025 10:30 PM
Keerthy Suresh didnt changed her surname
X

సాధారణంగానే అమాయిలకు పెళ్లైతే ఇంటి పేరు మారుతుంది. ఐతే కొన్ని ప్రాంతాల్లో ఇంటి పేరు కన్నా తండ్రి పేరుని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కేరళలో అమ్మాయిల పేర్ల వెనక తండ్రి పేరు ఉంటుంది. ఐతే పెళ్లి తర్వాత ఫాదర్ బదులుగా భర్త పేరుని పెడతారు. అక్కడ ఇది ఆనవాయితీగా వస్తుంది. ఐతే అది కంపల్సరీగా మార్చుకోవాల్సిందేనా అంటే కాదు. ఎవరి ఇష్టం వారిది. పెళ్లైనా తండ్రి మీద ప్రేమతో అలా పేరు చివర తండ్రి పేరు ఉంచుకున్న వారు ఉన్నారు.


ఐతే అందరేమో కానీ అందరికీ తెలిసే మలయాళ కథానాయికల విషయంలో ఇది చాలా అబ్జర్వేషన్ గా ఉంటుంది. ఈమధ్యనే పెళ్లి చేసుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లైనా కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. ఐతే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మహానటి కీర్తి సురేష్ పెళ్లైనా కూడా తన పేరులో ఎలాంటి మార్పులు చేసుకోలేదు.

పెళ్లి కాగానే కొందరు సోషల్ మీడియాలో తండ్రి పేరు బదులు భర్త పేరుని చేరుస్తారు. కానీ కీర్తి సురేష్ అలా చేయలేదు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంకా కీర్తి సురేష్ అనే కొనసాగిస్తుంది. ఫ్యూచర్ లో మారుస్తుందా లేదా అన్నది తెలియదు కానీ తండ్రి పేరుకి బదులుగా భర్త పేరు మార్చలేదా అనుకుంటూ కొందరు కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగులో దసా, భోళా శంకర్ సినిమాల తర్వాత ఛాన్స్ లు రాబట్టుకోలేదు అమ్మడు. ఐతే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఆఫర్ వచ్చినట్టు టాక్. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో చేస్తున్న రౌడీ జనార్ధన్ సినిమాలో కీర్తి సురేష్ ని తీసుకున్నారని టాక్. ఐతే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇక కీర్తి సురేష్ తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీ లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో కీర్తి సురేష్ చేసిన తొలి సినిమా బేబీ జాన్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఆ సినిమా కోసం కీర్తి కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా గ్లామర్ షో చేసింది. ఐతే ఆ సినిమా ఫెయిల్ అయినా అమ్మడికి బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్.