ఫోటోటాక్ : అందమైన చీర కట్టులో ఆన్ స్క్రీన్ మహానటి
సైడ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్.. ఇలా ఏ యాంగిల్ చూసినా కీర్తి సురేష్ అందం అంతకు మించి అన్నట్లుగా అనిపిస్తుంది
By: Tupaki Desk | 9 Dec 2024 9:22 AM GMTఈతరం ప్రేక్షకులు మహానటి సావిత్రిని చూడలేదు.. కానీ ఆమెను కీర్తి సురేష్‌లో చూసి ఆమె జీవిత చరిత్రను 'మహానటి' సినిమాతో తెలుసుకున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను శైలజతో వచ్చి మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, మొదటి సినిమాతోనే స్టార్‌గా నిలిచింది. మహానటి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయి సినిమా హీరోయిన్‌గా ఈ అమ్మడు నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ కీర్తి సురేష్ సొంతం అంటూ ఆమె ఫ్యాన్స్‌తో పాటు, సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
అందమైన రూపం కలిగి ఉన్న కీర్తి సురేష్ ఎలాంటి డ్రెస్‌లు వేసినా భలే అందంగా ఉంటుంది. ఆమె ఫిజిక్‌కి ప్రతి ఒక్క ఔట్ ఫిట్ భలే సెట్ అవుతాయని టాక్ ఉంది. అందుకే కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్‌తో పాటు, మంచి ఔట్ ఫిట్ ఏది అయినా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా చీర కట్టులో కీర్తి సురేష్ మెరిసింది. ప్రస్తుతం పెళ్లికి రెడీ అవుతున్న కీర్తి సురేష్ చీర కట్టు ఫోటోలను సోషల్ మీడియా ద్వార షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. విభిన్నమైన డిజైనర్ మోడ్రన్ చీరలో కీర్తి సురేష్ కనిపిస్తోంది.
కీర్తి సురేష్ యొక్క అందం ఈ చీర కట్టులో మరింత పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సైడ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్.. ఇలా ఏ యాంగిల్ చూసినా కీర్తి సురేష్ అందం అంతకు మించి అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెళ్లికి ముందు కీర్తి సురేష్ నుంచి వచ్చిన ఈ ఫోటోలు ఆమె మొహంలో పెళ్లి కల వచ్చినట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. కీర్తి సురేష్ తన చీర కట్టు ఫోటోలతో గతంలో చాలా సార్లు వైరల్ అయ్యింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఈ చీర కట్టులో అందంగా కనిపిస్తుంది.
బాలీవుడ్‌లో బేబీ జాన్ సినిమాలో మొదటి సారి హద్దులు దాటి అందాల ప్రదర్శన చేసిన ఈ అమ్మడు భలే ముద్దుగా ఉంది అంటూ హిందీ ప్రేక్షకులతోనూ అనిపించుకుంది. ముందు ముందు మరింతగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసి సౌత్‌లో మరింతగా ఈ అమ్మడు ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. పెళ్లికి ముందు కీర్తి సురేష్ అందాల బాంబు పేల్చడం పట్ల కొందరు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. మరి తెలుగులో ఈ అమ్మడు చేయబోతున్న తదుపరి సినిమా ఏంటో చూడాలి.