Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : క్యూట్‌ కీర్తి రాయల్‌ లుక్‌

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త పద్దతి మార్చుకుందని టాక్ వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   17 March 2025 8:00 PM IST
పిక్ టాక్‌ : క్యూట్‌ కీర్తి రాయల్‌ లుక్‌
X

బాలనటిగా పాతిక ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కీర్తి సురేష్ హీరోయిన్‌గా ప్రస్తుతం బిజీగా ఉంది. మలయాళం మూవీ గీతాంజలితో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాల్లో నటించింది. మలయాళంలో హీరోయిన్‌గా మొదటి సినిమా చేసిన రెండేళ్లకే తమిళ్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. ఆ తదుపరి సంవత్సరంలోనే తెలుగులో రామ్‌ కు జోడీగా 'నేను శైలజ' సినిమాలో నటించింది. కెరీర్‌ ఆరంభం నుంచి మొన్నటి వరకు స్కిన్‌ షో విషయంలో కీర్తి సురేష్ చాలా దూరం ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లు అనిపిస్తుంది. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త పద్దతి మార్చుకుందని టాక్ వినిపిస్తుంది.

టాలీవుడ్‌లో ఈమె మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. కానీ స్కిన్‌ షో కి ఓకే చెప్పక పోవడంతో పాటు, ఇతర కారణాల వల్ల తెలుగులో ఎక్కువగా ఈమె కనిపించడం లేదు. టాలీవుడ్‌లో ఈమెకు మహానటి సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసిన కీర్తి సురేష్ ఈమధ్య కాలంలో తెలుగులో సినిమాలు చేయడమే బొత్తిగా మానేసింది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి నటన ప్రతిభ ఉన్న కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ్‌, హిందీ సినిమా ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తుంది.

ఎన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రెగ్యులర్‌ ఫోటోల కంటే ఈసారి కీర్తి సురేష్ కాస్త గ్లామర్‌గా కనిపిస్తుందని కొంరదు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ విభిన్నమైన ఔట్ ఫిట్‌లో రాయల్‌ లుక్ వచ్చింది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి ఔట్‌ ఫిట్‌తో పాటు ప్రతి ఒక్కటీ చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. కీర్తి సురేష్ అందమైన ఔట్‌ ఫిట్‌లో మరింత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్‌ తెగ కామెంట్‌ చేస్తూ ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

కీర్తి సురేష్ తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా నెటిజన్స్‌కి వినోదాన్ని పంచుతుంది. క్యూట్‌ కీర్తి సురేష్ మెల్ల మెల్లగా రూటు మార్చుకుంటూ ఉందని కొందరు అంటున్నారు. తెలుగులో కీర్తి సురేష్ చివరగా భోళా శంకర్‌ సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా ముఖ్య పాత్రలో నటించింది. తెలుగులో హీరోయిన్‌గా కీర్తి సురేష్ చివరగా దసరాలో నటించింది. నానితో పోటీ పడి మరీ ఆ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్‌ లుక్‌తో అలరించింది. అంతే కాకుండా సీరియస్‌గా నటించి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ అమ్మడి సందడి కనిపించడం లేదు.