గ్లామర్ గాలిలో కీర్తి విశ్వరూపం...క్లిక్కయ్యేనా?
ఇక ఈ సాంగ్ లో కీర్తి సురేష్ గ్లామర్ అండ్ బోల్డ్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 26 Nov 2024 7:51 AM GMTసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ కి జోడీగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటించింది. డిసెంబర్ 20న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. అట్లీ ఈ సినిమాని హిందీలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. విజయ్ ‘తెరి’ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్, వరుణ్ ధావన్ మీద చిత్రీకరించిన డ్యూయెట్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇక ఈ సాంగ్ లో కీర్తి సురేష్ గ్లామర్ అండ్ బోల్డ్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఆమె బోల్డ్ లుక్స్ ఇప్పుడు సౌత్ లో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి కీర్తి సురేష్ సౌత్ లో ఇప్పటి వరకు గ్లామర్ అండ్ బోల్డ్ లుక్స్ లో కనిపించలేదు. ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసింది. కొన్ని సినిమాలలో గ్లామర్ రోల్స్ చేసిన కూడా మరీ శృతి మించి అందాల ప్రదర్శన చేయలేదు.
‘సర్కారువారిపాట’ సినిమాలో కీర్తి సురేష్ గ్లామర్ రోల్ లోనే ఆల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా కనిపించింది. ఇందులో మోడ్రన్ అవుట్ ఫిట్ లలో కీర్తి సురేష్ కనిపించిన మరీ ఘాటైన లుక్స్ లో అయితే కాస్ట్యూమ్స్ వేయలేదు. కానీ ‘బేబీ జాన్’ కోసం ఆమె పెట్టుకున్న హద్దులు బ్రేక్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ కి ఎట్రాక్ట్ చేసే విధంగా కంప్లీట్ హీటెక్కించే బోల్డ్ లుక్స్ తో సాంగ్ లో కీర్తి సురేష్ కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ‘బేబీ జాన్’ టీజర్ లో కీర్తి సురేష్ క్యారెక్టర్ ని అంతగా రివీల్ చేయలేదు.
అయితే సడెన్ గా నైన్ మాటక్క సాంగ్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఇందులో డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కీర్తి సురేష్ మెప్పించడమే కాకుండా అదిరిపోయే గ్లామర్ అవుట్ ఫిట్ లతో కాస్తా బోల్డ్ గా కనిపించి మెస్మరైజ్ చేసింది. కీర్తి సురేష్ లో ఇప్పటి వరకు చాలా మంది ఇలాంటి యాంగిల్ ని చూడలేదు. అయితే క్యారెక్టరైజేషన్ కి తగ్గట్లుగా తనని తాను మార్చుకోవడానికి సిద్ధం అని ‘బేబీ జాన్’ తో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ కూడా కెరియర్ ఆరంభంలో సింపుల్ పాత్రలలోనే ఎక్కువగా కనిపించింది.
అయితే రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ మూవీస్ లో గ్లామర్ డోస్ పెంచడంతో పాటు పాటు ఇంటిమేట్ సన్నివేశాలు కూడా చేసింది. ట్రెండ్ కి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలని అనుపమ చెప్పింది. అలాగే కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి తనలోని గ్లామర్ యాంగిల్ ని బయటకి తీసుకొచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. గతంలో తాప్సి కూడా సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత బికినీ వేసింది. అయితే ఆమె స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. మరి కీర్తి సురేష్ కెరియర్ ఎలా ఉంటుందనేది చూడాలి.