#గుసగుస.. మహానటి కీర్తి సురేష్ పెళ్లి
మహానటి కీర్తి సురేష్ పెళ్లికి రెడీ అవుతోందని, డిసెంబర్ లో సుముహూర్తం నిర్ణయించారని హిందీ మీడియాలో కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 17 Nov 2024 4:23 AM GMTమహానటి కీర్తి సురేష్ పెళ్లికి రెడీ అవుతోందని, డిసెంబర్ లో సుముహూర్తం నిర్ణయించారని హిందీ మీడియాలో కథనాలొస్తున్నాయి.కీర్తి తన స్నేహితుడిని పెళ్లాడేందుకు ఓకే చెప్పింది. ఎగ్జోటిక్ బీచ్ లొకేషన్ గోవాలో పెళ్లి వేదికను ఫిక్స్ చేసేశారంటూ కథనాలు రాగా, అవే వార్తలు ఇప్పుడు సౌత్ మీడియాలోను వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్ని కీర్తి సురేష్ కానీ, తన తల్లిదండ్రులు కానీ అధికారికంగా ధృవీకరించలేదు.
అయితే కీర్తి పై ఇలాంటి ప్రచారం ఇదే మొదటి సారి కాదు. గతంలో పలుమార్లు అన్ని మీడియా చానెళ్లలోను కీర్తి సురేష్ కి పెళ్లయిపోతోందంటూ ప్రచారం సాగింది. దుబాయ్ వ్యాపారితో కీర్తి పెళ్లి కుదిరిందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ తో సన్నిహితంగా ఉందని కూడా కొన్ని మీడియాల్లో ప్రచారం సాగింది. ఇటీవల అనిరుధ్ నే పెళ్లాడేస్తోందంటూ ప్రచారం హోరెత్తిపోతోంది. కానీ ఇవన్నీ ఆధారాలు లేని రూమర్లుగా భావించాల్సి ఉంటుంది.
కొంత గ్యాప్ తరవాత మళ్లీ ఇప్పుడు ప్రచారం మరో స్థాయిలో హోరెత్తుతోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి కీర్తి ఓకే చెప్పడంతోనే పెళ్లి వైపు వడి వడిగా అడుగులు పడుతున్నాయనేది మీడియా లో కథనాలొస్తున్నాయి. కొద్దిమంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి గోవాలో జరుగుతుందని, త్వరలోనే ఈ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకూ అధికారిక దీనిని ప్రకటించలేదు. ఇది నిజమైతే అఫీషియల్ గా చెబుతారేమో చూడాలి.