కీర్తి సురేష్ పెళ్లి.. ఆ బంధం ఈనాటిది కాదు..
డిసెంబర్ 11 లేదా 12 తేదీలలో గోవాలో వారి వివాహ వేడుక జరగబోతోందని అంటున్నారు. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కేరళ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
By: Tupaki Desk | 20 Nov 2024 8:32 AM GMTసౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఆరంభంలో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తని కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వినిపించాయి. తరువాత కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తో కొంతకాలం పాటు రిలేషన్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలని వైరల్ చేసి కీర్తి, అనిరుద్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ గాసిప్స్ అల్లేశారు.
అయితే అందులో వాస్తవం లేదని కీర్తి సురేష్ తల్లిదండ్రులు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మరోసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి ఫిక్స్ అయ్యిందని. తన స్నేహితుడైన వ్యాపారవేత్తని కీర్తి సురేష్ పెళ్లాడబోతోందని టాక్ నడుస్తోంది. అలాగే అతని పేరు ఆంటోనీ తటిల్ అనే మాట ప్రచారంలో ఉంది. కీర్తి సురేష్ పెళ్లిచేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ ఆంటోనీ తటిల్ ఫోటో కూడా వైరల్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారంట. మొదటి పరిచయం నుంచి కీర్తి సురేష్ కు అతను క్లోజ్ ఫ్రెండ్ అని సమాచారం.
అయితే వారి ప్రేమలో పడడానికి మాత్రం కొంత సమయం పట్టిందట. కెరీర్ సెట్ చేసుకున్న తరువాతనే పెళ్లి గురించి ఆలోచించుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఆంటోనీ తటిల్ కొచ్చిలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారంట. గతంలో దుబాయ్ లో ఇంజనీర్ గా కొంతకాలం వర్క్ చేసి మరల తిరిగి కేరళ వచ్చేసి వ్యాపారం పెట్టుకున్నారంట. ఇక ఇప్పుడు ఇద్దరు ఒక ట్రాక్ లో ఉండడంతో పెళ్లికి సరైన సమయం అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 11 లేదా 12 తేదీలలో గోవాలో వారి వివాహ వేడుక జరగబోతోందని అంటున్నారు. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కేరళ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే కీర్తి సురేష్ కుటుంబం నుంచి మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ ఈ సారి జరుగుతోన్న పెళ్లి ప్రచారం వాస్తవమే అని సినీ వర్గాలలో అనుకుంటున్నారు.
కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే ప్రైవేట్ గా వీరి వివాహ వేడుక జరగబోతోందని టాక్ నడుస్తోంది. ఈ ప్రచారంపై కీర్తి సురేష్ లేదంటే ఆమె ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటే తరువాత సినిమాలకి దూరం అవుతుందా లేదంటే ఈ జెనరేషన్ హీరోయిన్స్ తరహాలో కెరియర్ కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. ‘రివాల్వర్ రీటా’ అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.